కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 184

RRR Special Promo Video To Come Out Soon,#RRR, #RRR Movie, Jr NTR, Latest Telugu Movies News, Rajamouli, Ram Charan, RRR Movie Updates, RRR Special Promo, RRR Special Promo Video Release Date, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, Telugu Fi
రిలీజ్ అప్‌డేట్

మారిన 'RRR' రిలీజ్ డేట్

మొత్తానికి అనుకున్నదే జరిగింది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ విషయంలో గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తూనే వున్నాయి. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని.. ముందు ఫిక్స్ చేసిన డేట్ కు రావడం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. నిజంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Mega Family Hero Kalyaan Dhev Sign Up For A New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kalyaan Dhev,Kalyaan Dhev Latest News,Kalyaan Dhev New Movie News,Kalyaan Dhev Upcoming Film Updates,Kalyaa
సినిమా వార్తలు

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ న్యూ మూవీ

గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రముఖ డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మెగా స్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది. "విజేత" మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రశంసలు అందుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా నటించే ఈ మూవీ షూటింగ్ మార్చి లో ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
#RRR, #RRR Movie, Jr NTR, Latest Telugu Movies News, Rajamouli, Ram Charan, RRR Movie Updates, RRR Special Promo, RRR Special Promo Video To Come Out Soon, RRR Telugu Movie, RRR Telugu Movie Latest News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tolly
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
Tamil Movie Popular Comedian Yogi Babu Gets Married,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Comedian Yogi Babu,Yogi Babu,Yogi Babu Latest News,Yogi Babu Marriage News,Yogi Babu Marriage Details,Actor Y
సినిమా వార్తలు

తమిళ కమెడియన్ యోగి బాబు వివాహం

సుమారు 120 తమిళ మూవీస్ లో నటించి తన కామెడీ టైమింగ్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ కమెడియన్ యోగిబాబు బ్లాక్ బస్టర్ తమిళ డబ్బింగ్ మూవీస్ అదిరింది, సర్కార్, విజిల్, విశ్వాసం, దర్బార్ మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.స్క్రీన్ పై కనపడగానే నవ్వులు విరబూసే యోగి బాబు వివాహం ఈ రోజు జరిగింది.

Team TFNవాట్సాప్
Everyone Will Get Connected With Jaanu Movie Says Dil Raju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Dil Raju,Jaanu Movie,Jaanu,Jaanu Telugu Movie,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Dil R
సినిమా వార్తలు

'జాను' చిత్రంతో ప్రతి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు - దిల్‌రాజు

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా మంగ‌ళ‌వారం వైజాగ్‌లో జ‌రిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కార్య‌క్ర‌మంలో...

TFN Adminవాట్సాప్
Elite Entertainments Begins Production Work For Their First Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kiran Abbavaram,Priyanka Jawalkar,Kiran Abbavaram and Priyanka Jawalkar teaming up for their ne
సినిమా వార్తలు

ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 ప్రారంభం

"రాజా వారు రాణి గారు" మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం, సక్సెస్ ఫుల్ మూవీ "టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ జంటగా రూపొందుతున్న ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నెం 1 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం అయింది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dil Raju, Dil Raju Latest News, Dil Raju Linesup Three Remake Movies For 2020, Dil Raju New Movie News, Dil Raju News, Dil Raju Next Movie Details, Dil Raju Upcoming Film Updates, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, To
సినిమా వార్తలు

దిల్ రాజు రీమేక్ ల సందడి..!

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. అదృష్టాన్ని ఎప్పుడూ తన పాకెట్ లో పెట్టుకొని తిరిగినట్టే దిల్ రాజు సినిమాలు అంటే మాగ్జిమమ్ హిట్ నే సొంతం చేసుకుంటాయి. చాలా తక్కువ సినిమాలే ప్లాప్ ను సొంతం చేసుకున్నాయి. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పటివరకూ స్ట్రెయిట్ సినిమాలే నిర్మించిన దిల్ రాజు.. ఇప్పుడు…

TFN Adminవాట్సాప్
Energetic Star Ram Lends His Voice For Romantic Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Energetic Star Ram,Ram Pothineni,Ram Pothineni News,Ram Pothineni Latest News,Romantic,Romantic Movie,Roman
సినిమా వార్తలు

"రొమాంటిక్" మూవీ కి రామ్ వాయిస్ ఓవర్ ?

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మి) నిర్మాణ సారథ్యం లో అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , మోడల్ కేతికా శర్మ జంటగా మాఫియా నేపథ్యంలో ఒక లవ్ స్టోరీ "రొమాంటిక్" మూవీ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో మందిరా బేడీ, మకరంద్ దేశ్ పాండే, దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
O Pitta Katha Teaser Release Date Gets Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,O Pitta Katha,O Pitta Katha Movie,O Pitta Katha Telugu Movie,O Pitta Katha Movie Updates,O Pitta Katha Telugu Mo
ట్రైలర్ & టీజర్

'ఓ పిట్ట కథ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

చందు ముద్దు నూతన దర్శకుడిగా పరిచయం అవుతూ.. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజ‌య్ రావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా 'ఓ పిట్ట కథ'. ఒక విలేజ్‌లో జ‌రిగే స్టోరీ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ‌రుపుకుంటుంది. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇటీవలే ఈ సినిమా ప్రీ టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇక దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

TFN Adminవాట్సాప్
Uppena Movie First Wave Video Promo Is Out
సినిమా వార్తలు

"ఉప్పెన " మూవీ ఫస్ట్ వేవ్ వీడియో ప్రోమో రిలీజ్

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందుతున్న "ఉప్పెన " మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడు గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాజల్ మైనపు ప్రతిమ ఆవిష్కరణ

దశాబ్దానికి పైగా తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వ్యాక్స్ స్టాట్యూ ఈ రోజు సింగపూర్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో ఆవిష్కరణ జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ల తరువాత టాలీవుడ్ నుండి కాజల్ ఈ గౌరవం పొందారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో అరుదైన గౌరవం అందుకున్న కాజల్ సౌత్ ఇండియా లో మొదటి సినీనటి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఖైదీ`ని డైరెక్ట్ చేయ‌నున్న ప్ర‌ముఖ హిందీ ద‌ర్శ‌కుడు?

తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఖైదీ`(కార్తి క‌థానాయ‌కుడు)... హిందీలో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ని నిర్మించిన డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ తో క‌ల‌సి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రిలయ‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాయిప‌ల్ల‌వి బ‌ర్త్ డే స్పెష‌ల్ గా `ల‌వ్ స్టోరి`?

`ఫిదా` వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, డాన్సింగ్ సెన్సేష‌న్ సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `ల‌వ్ స్టోరి`. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. కాగా, ఈ చిత్రాన్ని వేస‌విలో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే యూనిట్ ప్ర‌క‌టించింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. సాయిప‌ల్ల‌వి పుట్టిన‌రోజుని పుర‌స్క‌రించుకుని మే 9న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ని తెలిసింది. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తున్న చైనీస్ `దృశ్యం`

భార‌తీయ తెర‌పై ప‌లు విదేశీ క‌థ‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే, ఇక్క‌డి సినిమాలు అక్క‌డ రీమేక్ అవ‌డం అరుదుగా జ‌రుగుతుంది. అలాంటి అరుదైన ప్ర‌య‌త్నమే... `షీప్ వితౌట్ ఎ షెఫ‌ర్డ్`. మ‌ల‌యాళ చిత్రం `దృశ్యం`కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమా... గ‌త ఏడాది డిసెంబ‌ర్ 13న విడుద‌లై... చైనాలో 2019 టాప్ 10 హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్స్ లో స్థానం ద‌క్కించుకుంది. ఇప్ప‌టికీ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. మొత్త‌మ్మీద‌... ఒక భార‌తీయ చిత్రం విదేశీ భాష‌లో రీమేక్ కావ‌డ‌మే కాకుండా క‌మ‌ర్షియ‌ల్ గానూ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం రేర్ రికార్డ్ గానే చెప్పుకోవ‌చ్చు.

Team TFNవాట్సాప్
Jaanu Run Time Details Are Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Jaanu,Jaanu Movie,Jaanu Telugu Movie,Jaanu Movie Updates,Jaanu Telugu Movie Latest News,Samantha,Sharwanand
సినిమా వార్తలు

`జాను` ర‌న్ టైమ్ డిటైల్స్

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `96`.. తెలుగులో `జాను` పేరుతో రూపొందిన సంగ‌తి తెలిసిందే. శ‌ర్వానంద్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ని మాతృక ద‌ర్శ‌కుడు సి. ప్రేమ్ కుమార్ రూపొందించాడు. `దిల్` రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కి బాణీలు అందించిన గోవింద్ వ‌సంత సంగీత‌మందించాడు.

Team TFNవాట్సాప్
Kiara Advani To Pair Up With Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kiara Advani,Pawan Kalyan,Pawan Kalyan New Movie With Kiara Advani,Pawan Kalyan Latest Movie Heroine Confirmed,Kiara Ad
సినిమా వార్తలు

ప‌వ‌న్ కి జోడీగా కియారా అద్వాని?

`భ‌ర‌త్ అనే నేను`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యమైంది కియారా అద్వాని. ఆపై `విన‌య విధేయ రామ‌`తోనూ మురిపించింది. ప్ర‌స్తుతం ప‌లు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాగా, త్వ‌ర‌లోనే కియారా మ‌రో తెలుగు సినిమాలో న‌టించ‌బోతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సినీరంగ అభివృద్ధికి చిరు-నాగ్ లతో తలసాని భేటీ..!

అలనాటి లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ లు సినిమాలు చేస్తున్నప్పుడే మద్రాస్ నగరం నుండి మన తెలుగు పరిశ్రమను హైదరాబాద్ కు తరలించుకున్నారు. అప్పటినుండి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఈ స్థాయిను చేరుకుంది. పక్కన సినీ పరిశ్రమ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకునే రేంజ్ కు ఎదిగాం.. ఇక ఇప్పుడు ఈ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు మన అగ్ర హీరోలు. ఇక సినీ రంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీయార్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా బాలీవుడ్ ఎంట్రీ చాలా పెద్ద మ్యాటర్..!

‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వచ్చిన మూడో చిత్రం "అల వైకుంఠపురములో". సంక్రాంతి బరిలో దిగిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఓ రేంజ్ లో సత్తా చాటి దూసుకుపోతుంది. సినిమా విడుదలై మూడు వారాలవుతున్నా ఇంకా కొన్ని థియేటర్స్ ఫుల్ గానే నడుస్తూ కోట్ల కలెక్షన్స్ రాబడుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఉప్పెన నుండి రాబోతున్న 'ఫస్ట్ వేవ్'

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు మరో యంగ్ మెగా హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడాని వస్తున్నాడు. సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు.. రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇవ్వదానికి రెడీ అయ్యారు. రేపు ఉదయం 9.9 నిమిషాలకు ఈ సినిమా నుండి 'ఫస్ట్ వేవ్' రాబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ వారు అధికారికంగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అఖిల్4 టైటిల్ రిలీజ్

అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అఖిల్ కు ఎందుకో పాపం మూడు సినిమాలు కూడా హిట్ ఇవ్వలేకపోయాయి. ఈసారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్