
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 84

సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ

‘ఓ బేబీ’కి `దృశ్యం` సెంటిమెంట్

గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు

రామ్ జోడీగా నివేదా?

ఓ బేబి మూవీ మౌత్ టాక్
సోలో కే సై అంటున్న ముద్దుగుమ్మలు

గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?

‘మిస్టర్ kk’ ట్రైలర్ రిలీజ్

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రిలీజ్


సాహో నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ టీజర్

హైదరాబాద్ లో గోపిచంద్ 'చాణక్య'
సినిమా తీయకపోతే మూసేసినట్టేనా..!
పాత్ర కోసం వినాయక్ కష్టాలు

హ్యాట్రిక్ కొట్టిన ఎస్పీ ప్రొడక్షన్స్
సురేష్ ప్రొడక్షన్స్... తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న టాప్ ప్రొడక్షన్ సంస్థలలో ఒకటి. ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. అంతేకాదు ఎంతో మంది హీరో హీరోయిన్స్ కూడా ఈ సంస్థ ద్వారా పరిచయమయ్యారు. అందుకే మూవీ మొఘల్, స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఈ సంస్థను స్థాపించి దాదాపు 55 ఏళ్ళు కావస్తున్నా కూడా ఏనాడూ వెనుకపడలేదు. రామానాయుడుతో పాటు పలు సినిమాలను నిర్మిస్తూ.. రామానాయుడు అనంతరం...ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు సురేష్ బాబు.. ఇప్పుడైతే అటు పెద్ద సినిమాలను నిర్మిస్తూనే.. చిన్న సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఒక రకంగా చిన్న సినిమాలకు ఎస్పీ…
సరిలేరు నీకెవ్వరు షూటింగ్ షురూ
మహర్షి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మహేష్ బాబు ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాకు 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించారు ఈ సినిమాకు. అయితే తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. కాశ్మీర్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈరోజు ప్రారంభించారు.

ఓ బేబి మూవీ రివ్యూ
మిక్కీ జె మేయర్ మ్యూజిక్ పాస్ అనిపించుకోగా రిచర్డ్ ప్రసాద్ కెమెరా, జునైడ్ ఎడిటింగ్ తదితర టెక్నికల్ అంశాలు బాగున్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్ర నిర్మాణం పట్ల పూర్తి అవగాహన కలిగిన నిర్మాతలు"ఓ..బేబీ" కి ఏం కావాలో అవి సమకూర్చి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ను అందించటంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి అంచనాల అంచులను అందుకున్న" ఓ.. బేబీ" కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తమిళ బ్యూటీ టాలీవుడ్ లో బిజీ
ఒరునాళ్ కూత్తు తమిళ మూవీ తో కోలీవుడ్ లో ఎంటరయిన తమిళ బ్యూటీ నివేత పేతురాజ్ నటించిన ఫస్ట్ ఇండియన్ స్పేస్ మూవీ టిక్ టిక్ టిక్ తమిళంలో ఘనవిజయం సాధించింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన నివేత నటించిన చిత్రలహరి, బ్రోచేవారెవరురా మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి.

‘ఓ బేబీ’కి `దృశ్యం` సెంటిమెంట్
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన నిర్మాణ సంస్థల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్... పలు భాషల్లో సినిమాలను నిర్మించినప్పటికీ లేడీ డైరెక్టర్ల కాంబినేషన్స్‌లో తెరకెక్కించిన సినిమాలు తక్కువనే చెప్పాలి. సరిగ్గా ఐదేళ్ళ క్రితం శ్రీప్రియ దర్శకత్వంలో `దృశ్యం`ని (2014) నిర్మించగా... మళ్ళీ ఇప్పుడు నందినీ రెడ్డి దర్శకత్వంలో `ఓ బేబీ`ని నిర్మించింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ.

గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు
యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా పలు కుటుంబకథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘లక్ష్యం’ ఒకటి. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శ్రీవాస్ దర్శకుడిగా తొలి అడుగులు వేశాడు. జగపతిబాబు, కళ్యాణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ‘ఆహుతి’ ప్రసాద్, యశ్‌పాల్ శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించారు.

రామ్ జోడీగా నివేదా?
‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన నివేదా పేతురాజ్... ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన ‘చిత్రలహరి’తోనూ ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘బ్రోచేవారెవరురా’తో మరోసారి ప్రేక్షకులను అలరించిన ఈ భామ... బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆల్రెడీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అమ్మడు... బన్నీ హీరోగా నటించనున్న ‘ఐకాన్’లోనూ ఓ నాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ‘చిత్రలహరి’ వంటి సినిమాతో తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు కిషోర్…

ఓ బేబి మూవీ మౌత్ టాక్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.
సోలో కే సై అంటున్న ముద్దుగుమ్మలు
జనరేషన్ మారుతున్న కొద్దీ సినిమాలు తీసే పద్దతి కూడా మారుకుంటూ వచ్చింది. పాతకాలం సినిమాలను.. ఇప్పటి సినిమాలను పోల్చి చూస్తే ఎంతో తేడా ఉంటుంది. అప్పటి సినిమాల్లో కుటుంబ విలువలు, బంధాలు-బాంధవ్యాలు, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి ఇలా అనేక అంశాలు ఉండేవి. అప్పట్లో సినిమాలో హీరోయిన్ పాత్రలకు ఎంత ప్రాముఖ్యత ఉండేదో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నాంబ, సావిత్రి, సూర్యకాంతం, జమున, వాణిశ్రీ ఇలా మహానాయికలతో నటించాలంటే అప్పటి హీరోలు సైతం భయపడే వాళ్లు. హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని మరీ సినిమాలు రాసేవాళ్లు.

గుణ 369 మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై క్రేజీ స్టార్ కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో వాస్తవ సంఘటనలఆధారం గా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ గుణ 369 మూవీ ఆగస్ట్ 2వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ అనఘ హీరోయిన్ కాగా సాయి కుమార్, ఆదిత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. RX 100 వంటి బ్లాక్ బస్టర్ మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ గుణ 369 మూవీ కి సంగీతం సమకూర్చారు.

మూడు ఆసక్తికరమైన చిత్రాలతో బాలీవుడ్‌లోకి దిల్ రాజు?
‘దిల్’ రాజు... తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న నిర్మాత. నిర్మాతగా గత 16 ఏళ్ళుగా జైత్రయాత్రను కొనసాగిస్తున్న ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్... ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మూడు ఆసక్తికరమైన చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజు. అంతేకాదు... ఈ మూడూ కూడా తెలుగు సినిమా రీమేక్‌లు కావడం విశేషం.

రేపటి నుంచి `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ ప్రారంభం?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలనాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.

‘మిస్టర్ kk’ ట్రైలర్ రిలీజ్
చీకటి రాజ్యం ఫేమ్ రాజేష్ ఎమ్ సెల్వ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కందరం కొండన్. తెలుగులో ‘మిస్టర్ kk’ అనే టైటిల్ తో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నిజానికి ఎప్పుడో ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఫైనల్లీ ఈరోజు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇస్మార్ట్ శంకర్ ట్రైలర్ రిలీజ్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. జులై 18వ తేదీన ఈ సినిమాను రిలీజే చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, నాలుగు పాటలను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

దుష్ట - శిష్ఠ- విశిష్ట పాత్రలెన్నింటినో పాదాక్రాంతం చేసుకున్న అభినయ ఘనాపాటి ఎస్వీ రంగారావు
కొందరు వ్యక్తుల గురించి, వారు సాధించిన విజయాల గురించి , వారు నెలకొల్పిన ప్రమాణాల గురించి ఎన్ని సార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అలా ఎంత చెప్పినా... ఎన్నిసార్లు చెప్పినా తనివితీరని గొప్ప విశేషాల సమాహారమే నట సార్వభౌమ ఎస్వీ రంగారావు జీవిత చరిత్ర.

సాహో నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ టీజర్
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ కమ్ భారీ యాక్షన్ మూవీ సాహో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంగిపు దశకు వచ్చేయడంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టనున్నారు. ఇక ఈసినిమా అప్ డేట్స్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కాస్త ఊరటనిచ్చేందుకు ఇటీవలే టీజర్ ను రిలీజ్ చేయగా.. అది ఎన్నిసంచలనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు తాజాగా మరో సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. 'ద సైకో సయ్యాన్' అనే పాట టీజర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు.

హైదరాబాద్ లో గోపిచంద్ 'చాణక్య'
తమిళ డైరెక్టర్ తిరు సుబ్రహ్మణ్యమ్ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో 'చాణక్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. గతంలో ఇండో పాక్ బోర్డర్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పుడు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేశారు. ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
సినిమా తీయకపోతే మూసేసినట్టేనా..!
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తమిళ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ధనుష్. మామకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నా.. అవన్నీ తట్టుకొని తన నటనతో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. కేవలం తమిళ్ లోనే కాదు.. తెలుగు లో కూడా ధనుష్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తను ద ఎక్స్ ట్రార్డీనరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్ అనే ఇండో ఫ్రెంచ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
పాత్ర కోసం వినాయక్ కష్టాలు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ మూవీలు అందించిన స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుబోతున్న ఈసినిమాకు గతంలో శరభ అనే సినిమాను తీసిన దర్శకుడు నరసింహారావు దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి వినిపిస్తుంది.

2019 ప్రథమార్ధ ఫలితాలు అత్యంత నిరాశాజనకం
2019 ప్రథమార్థం పూర్తయింది. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అందించిన అధికారిక జాబితా ప్రకారం గడచిన ఆరు నెలల్లో 93 స్ట్రైట్ చిత్రాలు, 44 డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే సక్సెస్ రేటు షరా మామూలే. నిజానికి మామూలు కంటే తక్కువనే చెప్పాలి. 93 స్ట్రెయిట్ చిత్రాలను , 44 డబ్బింగ్ చిత్రాలను కలుపుకుని ఈ ఆరు నెలల్లో 137 చిత్రాలు విడుదలయ్యాయి. 180 రోజులలో 137 చిత్రాలు విడుదలయ్యాయి అంటే సంఖ్యా పరంగా ఆ ఫిగర్ చూసుకొని ఆనందపడాలో... ఆ మూకుమ్మడి పరాజయాల పరంపరను చూసి బావురుమనాలో తెలియని పరిస్థితి. వరుస ఫ్లాప్ లను చవిచూడటం చిత్ర పరిశ్రమకు కొత్తేమీ కాదు.కానీ 2019 ప్రథమార్థం ఇచ్చినంతటి షాకింగ్ రిజల్ట్స్ ను గత…