జయాపజయాలకు అతీతంగా సాగుతూ ప్రేక్షకులను అలరించే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అటువంటి ఆసక్తికరమైన కలయికల్లో మాస్ మహారాజా రవితేజ, యువ సంగీత సంచలనం ఎస్.ఎస్.థమన్‌ది ఒకటి. పలు మ్యూజికల్ హిట్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ఈ కాంబినేషన్… ఈ ఏడాదితో పదేళ్లను పూర్తి చేసుకోవడమే కాకుండా పది చిత్రాల ప్రయాణాన్ని కూడా పూర్తి చేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘కిక్’(2009)తో ప్రారంభమైన రవితేజ, థమన్ కాంబో జర్నీ… ఆ తరువాత ‘ఆంజనేయులు’(2009), ‘మిరపకాయ్’(2011), ‘వీర’(2011), ‘నిప్పు’(2012), ‘బలుపు’(2013), ‘పవర్’(2014), ‘కిక్ 2’(2015), ‘అమర్ అక్బర్ ఆంటోనీ’(2018)… ఇలా తొమ్మిది చిత్రాల వరకు సాగింది. ప్రస్తుతం వీరిద్దరి కలయికలో వస్తున్న ‘డిస్కోరాజా’(2019)తో వీరికి పదో చిత్రం కావడం విశేషం.
కాగా… రవితేజ హీరోగా నటిస్తున్న ‘డిస్కోరాజా’కు సంబంధించి… రెండు రోజుల క్రితం ఫస్ట్ సింగల్ “నువ్వు నాతో ఏమన్నావో”ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన ఈ పాటకు… గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తన గాత్రంతో ప్రాణం పోశారు. 80ల కాలం నాటి గీతాలను గుర్తుచేస్తూ రూపొందిన ఈ పాటను రవితేజ, పాయల్ రాజ్‌పుత్‌పై చిత్రీకరించారు. ఫీల్ గుడ్ మ్యూజిక్‌తో సాగిన ఈ మెలోడీ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో వన్ మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మరి… పాటతో ఇంప్రెస్ చేసిన రవితేజ, థమన్ జోడీ పదో చిత్రంతో మెమరబుల్ హిట్‌ని అందుకుంటుందేమో చూడాలి.
చిత్రీకరణ తుది దశకు చేరుకున్న `డిస్కో రాజా` త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ తాళ్ళూరి నిర్మాణంలో వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: