మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆనంద్ అన్నామలై దర్శకత్వం లో సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడి గా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా హీరో మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో తెరకెక్కుతుంది. హీరో మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ నవంబర్ లో ప్రారంభం కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ ముగింపు దశ లో ఉంది. నవంబర్ నెలలో విజయ్ హీరో మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న హీరో మూవీ లో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా నటిస్తున్నారు. అంతర్జాతీయ రోడ్ రేసింగ్ ఛాంపియన్ రజనీ కృష్ణన్ వద్ద కొన్నిరోజులు విజయ్ ట్రైనింగ్ పొందిన విషయం తెలిసిందే. మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న హీరో మూవీ లో పేట మూవీ ఫేమ్ మాళవిక మోహనన్ కథానాయిక. హీరో మూవీ నవంబర్ షూటింగ్ షెడ్యూల్ లో మూవీ లోని కీలక సన్నివేశాలను
దర్శకుడు ఆనంద్ తెరకెక్కిస్తారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































