‘డిస్కో రాజా’ బాలు పాడిన పాటకు సూపర్ రెస్పాన్స్

Disco Raja Song Gets Superb Response,2019 Latest Telugu Movie News, Disco Raja Movie First Single, Disco Raja Movie First Song Response, Ravi Teja Disco Raja Movie First Single Gets Superb Response, Ravi Teja Disco Raja Songs, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema News

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ డిస్కో రాజా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే మొన్న ఈ సినిమా నుండి మొదటి పాటని రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా విడుదల చేసిన డిస్కోరాజా ఫస్ట్ సింగల్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. థమన్ మ్యూజిక్ అందించగా. సాహిత్య బ్రహ్మ సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో ఎస్పీ. బాల సుభ్రమణ్యం పాట పాడారు. చాలా కాలం తర్వాత బాలు పడటంతో.. ఈ సాంగ్ పూర్తిగా రెట్రో ఫీల్ ని కలిగిస్తుంది. మంచి మీనింగ్ ఫుల్ పదాలతో ఉన్న ఈ పాట మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.

అలానే ఈ చిత్రం లో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ…వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.