అసురన్ మూవీ టీమ్ కు అభినందనలు

Mahesh Babu Appreciates Asuran Movie Team,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Mahesh Babu About Asuran Movie,Super Star Mahesh Babu Appreciates Asuran,Asuran Movie Updates

వి క్రియేషన్స్ బ్యానర్ పై వెట్రిమారన్ దర్శకత్వం లో ధనుష్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా అసురన్ తమిళ మూవీ అక్టోబర్ 4వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. దర్శకుడు వెట్రిమారన్, హీరో ధనుష్ కాంబినేషన్ లో రూపొందిన పొల్లాదవన్, ఆడుకాలం, వడ చెన్నై మూవీస్ ఘనవిజయం సాధించాయ. ఆడుకాలం మూవీ లో ధనుష్ అద్భుతంగా పర్ ఫార్మ్ చేసి ఉత్తమ నటుడిగా నేహనల్ అవార్డ్ అందుకొన్నారు. దసరా కానుకగా రిలీజయిన అసురన్ మూవీ 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసురన్ మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు తన స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సంఘర్షణ తో కూడుకున్న కథను సహజంగా తెరకెక్కించారని, అసురన్ మూవీ చాలా బాగుందని, హీరో ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ప్రకాష్ రాజ్, జివి ప్రకాష్, వి. క్రియేషన్స్ మరియు మొత్తం అసురన్ మూవీ టీమ్ కు అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా తన తమిళ్ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో హీరో ధనుష్ ఆకట్టుకొంటున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.