`రంగ‌మ్మ మంగ‌మ్మ‌` ఖాతాలో మ‌రో రికార్డు

Rangamma Mangamma Song Creates Another Record,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019,Telugu Filmnagar, Tollywood Cinema News,Rangamma Mangamma Song,Rangamma Mangamma Song Record,Rangamma Mangamma New Record

గ‌త ఏడాది సంచ‌ల‌నం `రంగ‌స్థ‌లం` చిత్రంలోని “రంగమ్మ మంగమ్మ” పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంతపై చిత్రీక‌రించిన ఈ గీతం థియేట‌ర్ల‌లో మాస్‌ని ఉర్రూత‌లూగించింది. కేవ‌లం థియేట‌ర్ల‌లోనే కాదు యూట్యూబ్‌లోనూ ఈ పాట సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. నిరుడు సామ్ పుట్టిన‌రోజు (ఏప్రిల్ 28) సంద‌ర్భంగా ఈ పాట‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌గా… తాజాగా 200 మిలియ‌న్ల (20 కోట్ల‌) వ్యూస్‌ని క్రాస్ చేసింది `రంగ‌మ్మ మంగ‌మ్మ‌`. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం, చంద్ర‌బోస్ సాహిత్యం, ఎం.ఎం.మాన‌సి గానం, ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, ప్రేమ్ ర‌క్షిత్ నృత్య‌ద‌ర్శ‌క‌త్వం… అన్నింటికి మించి చ‌ర‌ణ్ బాడీ లాంగ్వేజ్‌, సామ్ ఊర‌మాస్ స్టెప్పులు… వెర‌సి `రంగ‌మ్మ మంగ‌మ్మ‌`కి ఈ స్థాయి విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… యూట్యూబ్ ఛానల్‌లో తెలుగు సినిమా పాట‌లకు సంబంధించి “రంగమ్మ మంగమ్మ‌” రెండో స్థానంలో నిల‌వ‌గా… మొద‌టి స్థానంలో ‘ఫిదా’లోని “వ‌చ్చిండే”(225 మిలియన్ వ్యూస్) కొనసాగుతుండ‌డం విశేషం. మున్ముందు… 200 మిలియ‌న్ల వ్యూస్ క్ల‌బ్‌లో ఇంకెన్ని తెలుగు పాట‌లు చేరుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.