‘విక్టరీ’ వెంకటేష్, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `హార్స్ క్లబ్` బ్యాక్ డ్రాప్‌తో సాగే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… ఇందులో ఓ శక్తిమంతమైన పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దిన్ సిద్ధిఖీని ఎంపిక చేసే దిశగా తరుణ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘సర్ఫరోష్’ (1999) చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన నవాజుద్దిన్ సిద్ధిఖి… ఆపై ‘కహానీ’, ‘తలాష్’, ‘ది లంచ్ బాక్స్’, ‘బజరంగీ భాయిజాన్’, ‘మామ్’ వంటి సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి పలు పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నాడు. అంతేకాదు… ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సూపర్‌స్టార్ రజినీకాంత్ తమిళ అనువాద చిత్రం ‘పేట’తో దక్షిణాది ప్రేక్షకులనూ అలరించాడు. కట్ చేస్తే… మళ్ళీ ఇప్పుడు వెంకీ, తరుణ్ కలయికలో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదేమైనా, త్వరలోనే నవాజుద్దిన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా… ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కనున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























