హిందీకి వెళుతున్న‌ ‘భాగమతి’?

Anushka Bhaagamathie Goes To Bollywood?,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Anushka Bhaagamathie in Bollywood,Bhaagamathie Hindi Movie,Anushka New Movie Updates

‘భాగమతి’… గత ఏడాది తెలుగునాట కాసుల వర్షం కురిపించిన థ్రిల్లర్ మూవీ. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఈ హీరోయిన్‌ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ను జి.అశోక్ డైరెక్ట్ చేశాడు. కాగా, ఇప్పుడీ క్రేజీ ప్రాజెక్ట్‌ను హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా స‌మాచారం ప్ర‌కారం… `భాగమతి` హిందీ రీమేక్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత విక్రమ్ మల్హోత్రా సొంతం చేసుకున్నట్టు తెలిసింది. అంతేకాదు… అనుష్క పాత్ర‌లో టాలెంటెడ్ హీరోయిన్ భూమి ఫెడ్నేకర్ న‌టిస్తున్న‌ట్లు టాక్‌. భూమి నటించిన తాజా చిత్రాలు ‘సాండ్ కి ఆంఖ్’ ‘బాలా’, ‘పతి పత్ని ఆర్ వో’ విడుదలకు సిద్ధం కాగా… మరో రెండు హిందీ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ ద‌శ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో… `భాగ‌మ‌తి` రీమేక్ ఆమె చెంత‌కు చేర‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే… తెలుగు వెర్షన్‌ను రూపొందించిన‌ అశోక్ ఇప్పుడు హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కించ‌నున్నాడని బాలీవుడ్ ఖబర్. త్వ‌ర‌లోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − eight =