
ట్యాగ్ · 104 కథనాలు · పేజీ 2


సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ

ఒకే ఏడాది మూడు విషాదాలు

మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్ డేట్

మహేష్ బాబు ను పరామర్శించిన రామ్ చరణ్

#SSMB28 కోసం భారీ సెట్?

మహేష్ బాబు బర్త్ డే కు "క్యూబ్ " లో "ఒక్కడు"

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ "పోకిరి "రీ రిలీజ్

వైరల్ గా సూపర్ స్టార్ పిక్..!

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!

'ఆచార్య' కు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్..!

మహేష్ తో సినిమా చేయాలని ఉంది..!


#SSMB.. న్యూ చాప్టర్ అంటున్న మహేష్

హీరో కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ ఈ నెల 15 వ తేదీన అనారోగ్య సమస్యల వల్ల కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా ఆదివారం హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో సూపర్ స్టార్ అభిమానుల మధ్య కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమాన్నిమహేష్ బాబు నిర్వహించారు. ఈ కారిక్రమానికి అభిమానులతో పాటు కుటుంబ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి.. కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పై జాన్వీ కపూర్ స్టన్నింగ్ కామెంట్స్
సూపర్ హిట్ ధడక్ మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కథానాయికగా తెరకెక్కిన గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన జాన్వీ బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ రూహి , గుడ్ లక్ జెర్రీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . మలయాళ సూపర్ హిట్ హెలెన్ మూవీ హిందీ రీమేక్ మిలి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జాన్వీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ జాన్వీ ప్రస్తుతం బవాల్ , Mr &Mrs మహి మూవీస్ లో నటిస్తున్నారు.

సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ
టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి చేరిన కృష్ణ... చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , నాగ చైతన్య తదితరులు నటశేఖర్ కృష్ణ కి ఘన నివాళులర్పించారు, మహేష్ బాబును ఓదార్చుతూ ధైర్యం నింపారు.

ఒకే ఏడాది మూడు విషాదాలు
ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది మూడు విషాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మహేష్ తీవ్ర విషాదాన్ని మిగిల్చి మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి పద్మావతి కొద్ది రోజుల క్రిందటే మరణించారు. సెప్టెంబర్ లో ఆమె మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు మహేష్ బాబు. ఇంతలోనే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.

మహేష్-రాజమౌళి మూవీ క్రేజీ అప్ డేట్
రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ సినిమా వస్తుందని ఎప్పుడైతే తెలిసిందే.. అప్పటినుండీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వస్తూనే ఉంది. అంతేకాదు ఈసినిమా గురించి ప్రముఖ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఎన్నోసార్లు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు పై సాయి పల్లవి క్రేజీ కామెంట్
బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.

మహేష్ బాబు ను పరామర్శించిన రామ్ చరణ్
ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు. తాజాగా మహేష్ బాబు తన తల్లికి 11వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. సినీ సెలెబ్రిటీలు హాజరై ఇందిరా దేవి గారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు.

#SSMB28 కోసం భారీ సెట్?
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు-త్రివిక్రమ్ ది కూడా ఒకటి. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. వీటిలో అతడు సినిమా మంచి హిట్ ను కొట్టగా.. ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వలేదు కానీ ఈసినిమాకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. బుల్లి తెరపై ఖలేజా సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది.

100 రోజులు పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట
ఒకప్పుడు సినిమాలు 100రోజులు ఆడేవి, 365 రోజులు ఆడేవి అంటూ అంటుండేవారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చాలా కష్టం. ఇప్పుడు 50 రోజులు అంటేనే పెద్ద విషయంగా చెప్పుకునే రోజులు వచ్చాయి. ఇక 100 రోజులు అంటే అది గొప్ప విషయమే. ఈమధ్యకాలంలో మన తెలుగు సినిమాలు కొన్ని 100 రోజులు పూర్తి చేసుకోవడం మన ఇండస్ట్రీకి కలిసొచ్చే అంశమే అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా 100 రోజులు పూర్తి చేసుకుంది.

"#SSMB 28 " మూవీ కై ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అన్బరివు సోదరులు ?
శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మహేష్ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మహేష్ బాబు బర్త్ డే కు "క్యూబ్ " లో "ఒక్కడు"
సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు ,భూమిక జంటగా భారీ బడ్జెట్ , సెట్స్ తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఒక్కడు ” మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. "ఒక్కడు " మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ , హిందీ , ఒడియా , సింహళ భాషలలో రీమేక్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీ కై స్పెషల్ గా చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.

మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ "పోకిరి "రీ రిలీజ్
ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ” 2006 ఏప్రిల్ 28న రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణ మనోహర్ ఐ పి ఎస్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు , ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 200 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న "పోకిరి" మూవీ 63 సెంటర్స్…

వైరల్ గా సూపర్ స్టార్ పిక్..!
సినిమా సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఫ్యామిలితో ట్రిప్ కు వెళ్లడం అందరికీ తెలిసిందే కదా. ఇది మహేష్ కు ఎప్పటి నుండో ఉన్న అలవాటే. సినిమా పూర్తయిందంటే చాలు కొంత సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తాడు. సరదాగా ఫ్యామిలితో విదేశాలకు ట్రిప్ వేసేస్తాడు. ఇక ఇప్పుడు పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక ఆసినిమా హిట్ అవ్వడంతో కుటుంబంతో కలిసి సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్.

'మేజర్'.. మహేష్ తో రౌండ్ టేబుల్ మీట్..!
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా మేజర్. సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఇక ప్రివ్యూల నుండే ఈసినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈసినిమా కోసం పడిన కష్టానికి ప్రేక్షకులు విజయం అందించడంతో టీమ్ అంతా హ్యీపీగా ఉన్నారు. ప్రస్తుతం అయితే సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలు చిట్ చాట్ లు కూడా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే ఈసినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన మహేష్ తో కూడా మేజర్ టీమ్ రౌండ్ టేబుల్ నిర్వహించింది. ఈసందర్భంగా చిత్రయూనిట్ ఈ రౌండ్ టేబుల్ లో పాల్గొని ఒక్కొక్కరి అనుభవాలను పంచుకున్నారు.

'ఆచార్య' కు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్..!
ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో చిరుతో పాటు చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాను ఎప్పుడు చూద్దామా అని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక చిరు-చరణ్ సినిమా కావడంతో ఇప్పటికే సినిమాపై హైఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఈనెల 29న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశారు చిత్రయూనిట్. కొరటాలశివ, చరణ్ ఇప్పటికే ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసేశారు.

మహేష్ తో సినిమా చేయాలని ఉంది..!
ఎన్ని సినిమాలు చేసినా ప్రతి హీరోకు హీరోయిన్ కు కొన్ని స్పెషల్ రోల్స్ లో చేయాలని.. పలానా జోనర్ లో చేయాలని ఉంటుంది. ఇక డైరెక్టర్స్ కు అలానే ఉంటుంది. స్టార్ హీరోలతో చేయాలని ఉంటుంది. అలానే తమకు కూడా పలానా హీరోతో చేయాలన్న కోరిక ఉంటుంది. ఇక ఇప్పుడు బోయపాటి కూడా ఒక హీరోతో ఎప్పటినుండో చేయాలనుకుంటున్నాడట. మరి ఆహీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి.. తనకు ఎప్పటినుండో మహేష్ ను డైరెక్ట్ చేయాలని ఉందని.. ఫ్యూచర్ లో తను కనుక ఛాన్స్ ఇస్తే తప్పకుండా మహేష్ ను డైరెక్ట్ చేస్తానని తెలిపాడు. మరి ఫ్యూచర్ లో కనుక బోయపాటితో సినిమా చేసే అవకాశం వస్తే వీరిద్దరి ఖచ్చితంగా క్రేజీ…

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లలో ఎవరితోనైనా మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమే- మహేష్ బాబు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్నయాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'ఆర్ఆర్ఆర్' ఒక ఎపిక్.. రాజమౌళి సర్ గర్వంగా ఉంది..!
దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది. ఇక ఇంతకాలం వెయిట్ చేసినందుకు గాను అందరికీ ఫుల్ మీల్స్ అందించాడు రాజమౌళి. ఇక రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-రామ్ చరణ్ లో పెర్ఫామెన్స్, విజువల్స్ అన్నీ ఈసినిమాలో హైలెట్ గా నిలిచాయి. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రల్లో మరెవరూ నటించలేరు అన్నట్లుగా నటనతో అదరగొట్టారు. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరోవైపు ఈసినిమాను చూసి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభిమానులు , ప్రేక్షకులకు మహేష్ బాబు హోలీ శుభాకాంక్షలు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సింగిల్ కళావతి కి ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

#SSMB.. న్యూ చాప్టర్ అంటున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి సినిమా వచ్చి కూడా చాలా రోజులైపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మరో సినిమా రాలేదు. ఇక అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. కరోనా లేకపోతే ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేసి మిగిలినా పోర్షన్ ను కూడా కంప్లీట్ చేయనున్నారు. క కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.