బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ భారీ కలెక్షన్స్ తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులు కథానాయికల అందానికి పెద్ద పీట వేస్తారనే విషయం తెలిసిందే. అందం తో కాకుండా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సాయి పల్లవి తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ .. ఫలానా హీరోతో చేయాలనే కోరిక తనకు లేదనీ , కథ నచ్చితే ఎవరితో అయినా నటిస్తాననీ , తనకు ఒక స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని చెబితే ఆ హీరో ఎవరని కూడా అడగననీ , కథ చెప్పమంటాననీ , పరిశ్రమలో ఉన్న హీరోలందరి పై తనకు గౌరవం ఉందనీ , అల్లు అర్జున్ డాన్స్ ని బాగా ఇష్టపడతాననీ , ఇక మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చుతుందనీ , ఆయన్ని చూశాక… మగాళ్లు ఇంత అందంగా ఉంటారా! అనిపించిందనీ సాయి పల్లవి కామెంట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: