‘ఆర్ఆర్ఆర్’ ఒక ఎపిక్.. రాజమౌళి సర్ గర్వంగా ఉంది..!

Mahesh Babu superb words about RRR,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Superstar Mahesh Babu,Superstar Mahesh Babu Movies,Superstar Mahesh Babu Telugu Movies,Superstar Mahesh Babu Movie Updates,Superstar Mahesh Babu Latest Updates,Superstar Mahesh Babu Latest Movie Updates, Superstar Mahesh Babu Upcoming Movies,Superstar Mahesh Babu New Movies in 2022,Superstar Mahesh Babu Tollywood Movies in 2022,Superstar Mahesh Babu SUper Hit Movies,Superstar Mahesh Babu Sarkaru Vaari Paata Movie Updates, Superstar Mahesh Babu Shoot Updates,Prince Superstar Mahesh Babu Movie Sarkaru vaari paata Movie Updates,Sarkaru vaari Paata Movie songs Updates,Sarkaru vaari Paata Trending Songs,Superstar Mahesh Babu About RRR Movie, Superstar Mahesh Babu ABout Jr NTR and Ram Charan,Superstar Mahesh Babu about RRR Movie,Superstar Mahesh Babu Says RRR is a Epic,Superstar Mahesh Babu About Rajamouli, Superstar Mahesh Babu Next Movie With Rajamouli,#RRRMovie

దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం అభిమానులందరూ ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిపోయింది. ఇక ఇంతకాలం వెయిట్ చేసినందుకు గాను అందరికీ ఫుల్ మీల్స్ అందించాడు రాజమౌళి. ఇక రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-రామ్ చరణ్ లో పెర్ఫామెన్స్, విజువల్స్ అన్నీ ఈసినిమాలో హైలెట్ గా నిలిచాయి. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ అద్భుతంగా నటించారు. ఆ పాత్రల్లో మరెవరూ నటించలేరు అన్నట్లుగా నటనతో అదరగొట్టారు. ఇక నిన్న రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరోవైపు ఈసినిమాను చూసి సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మహేష్ కూడా తన ట్విట్టర్ ద్వారా సినిమాపై ప్రశంసలు కురిపించాడు. నార్మల్ సినిమాలు వేరు.. రాజమౌళి సినిమాలు వేరు. ఆర్ఆర్ఆర్ ఒక ఎపిక్. భారీ స్కేల్ లో తెరకెక్కించిన విధానం, గ్రాండ్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్ ఇలా ప్రతి అంశం ఊహకు అందని విధంగా ఉన్నాయి. ఒక గొప్ప దర్శకుడు మాత్రమే ఇలాంటి మ్యాజిక్‌ చేయగలడు. ఎంతో అద్భుతంగా తీశారు రాజమౌళి సర్‌, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది’. ఇక ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు అయితే తమ స్టార్డం ని మించి అవుట్ ఆఫ్ ది వరల్డ్ పెర్ఫామెన్స్ లను ఇచ్చారు. నాటు నాటు సాంగ్ అయితే మరో లెవెల్లో కనిపించారు.. మొత్తం చిత్ర యూనిట్ కి హ్యాట్సాఫ్ అంటూ తెలిపారు.

కాగా మహేష్-రాజమౌళి కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోతుంది. ఈసినిమా ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుందని ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో రాజమౌళి చెప్పాడు కూడా. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 19 =