#SSMB28 కోసం భారీ సెట్?

SSMB28 Extravant Sets Erected?,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,SSMB28,SSMB28 Movie,SSMB28 Telugu Movie,SSMB28 Movie latest Updates,SSMB28 Movie Shooting Updates,SSMB28 latest Updates,SSMB28 Extravant Sets,Mahesh Babu,Superstar Mahesh Babu,Mahesh Babu Upcoming Movie SSMB28,Mahesh Babu Upcoming Movie SSMB28 Shooting Updates,Extravant Sets Erected For SSMB28 Shooting

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి మహేష్ బాబు-త్రివిక్రమ్ ది కూడా ఒకటి. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. వీటిలో అతడు సినిమా మంచి హిట్ ను కొట్టగా.. ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వలేదు కానీ ఈసినిమాకు చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు. బుల్లి తెరపై ఖలేజా సినిమా ఇప్పటికీ చూస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో పూర్తిచేసుకుంది కానీ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. అయితే సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే మ‌హేష్ త‌న పాత్ర కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈసినిమా కోసం త్రివిక్రమ్ ఓ భారీ సెట్ ను వేయించనున్నట్టు తెలుస్తుంది. హైద్రాబాద్ లోని ఫిలింసిటీలో భారీ సెట్ వేయనున్నారట. ఇక్కడ షూటింగ్ చాలా వరకూ పూర్తి చేయనున్నాడట. అంతేకాదు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తోనే త్రివిక్రమ్ ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు సమాచారం.

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.