కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sai Dharam Tej Latest News

ట్యాగ్ · 56 కథనాలు · పేజీ 3

షూటింగ్ అప్‌డేట్

'సోలో బ్రతుకే సో బెటర్' షూటింగ్ పూర్తి

అలా షూటింగ్ మొదలుపెట్టారో లేదో ఇలా షూటింగ్ ను కంప్లీట్ చేసేసారు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రయూనిట్. చూడబోతే లాక్ డౌన్ ముందే దాదాపు సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు కనిపిస్తుంది. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ చేసింది. సరిగ్గా పది రోజులు షూటింగ్ జరిపారు. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తయినట్టు తెలిపాడు సాయి తేజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. సరదా సరదాగా సాగిన మా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని. సెట్స్ లో ఇంతవరకూ డల్ మూమెంట్ అన్నది లేదు అని తెలిపాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

మళ్లీ షూటింగ్ షురూ చేసిన 'సోలో బ్రతుకే సో బెటర్' టీమ్

సుబ్బు ద‌ర్శ‌కత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కరోనా వల్ల కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. మధ్యలో షూటింగ్ లకు అనుమతులు వచ్చిన ఎవరు అంత ధైర్యం చేయలేకపోయారు. అయితే దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మూవీ షూటింగ్ మ‌ళ్లీ స్టార్ట్ అయింది. చిత్రబృందం మొత్తం ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Actor Sai Dharam Tej To Act In A Mystical Thriller
సినిమా వార్తలు

'మిస్టికల్ థ్రిల్లర్' గా సాయి తేజ్ కొత్త సినిమా

రొటీన్ గా ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ కాదని మన హీరోలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నాలుగు ఫైట్ లు పాటలు కామెడీ ఉంటే చూసే రోజులు పోయాయి. అందుకే హీరోలు కూడా కొత్త కొత్త జోనర్ లు చేయడానికి ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగానే యంగ్ హీరో సాయి తేజ్ కూడా కొత్త జోనర్.. కొత్త కథతో వస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను సాయితేజ్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొత్త జోనర్ లో చేయడం ఎప్పుడూ ఎగ్జైటింగానే ఉంటది. అది కూడా సుకుమార్ లాంటి మూవీ మేకర్ తో అసోసియేట్ అవ్వడం అంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది అని తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను ట్వీట్ చేసాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అందుకే రిలేషన్ షిప్ లో లేను..!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌ లిస్ట్ తగ్గిపోతుంది. ఈలిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న రానా, నితిన్ ఇద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతన్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే మెగా కుటుంబంలో ముందు వరసలో ఉన్న చరణ్, బన్నీ పెళ్లి చేసుకున్నారు. వరుణ్, శిరీష్ ల పెళ్ళిళ్లకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ముందు వరుసలో కనపడుతుంది సాయి తేజ్ ఒక్కడే. పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒకటే గొడవ చేస్తున్నారని చెప్పాడు. పెళ్లి వద్దని ఇంటి నుంచి పారిపోవడం కూడా ఇక కష్టమేనని ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో పనులకంటే యాక్షన్ సీక్వెన్సే ఈజీ..!

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ టైం లో తాను కూడా ఓ కొత్త విషయం తెలుసుకున్నా అంటున్నాడు సాయి తేజ్. నేను షూటింగ్స్ తో బిజీగా ఉంటా కాబట్టి రోజూ తాను ఇంట్లో ఏం చేస్తుందో చూసే ఛాన్స్ ఉండేది కాదు.. ఇప్పుడు లాక్ డౌన్ లో ఇంట్లో ఉండటం వల్ల రియలైజ్ అయ్యాను మన తల్లులకు మనం గ్రాంటెడ్ గా ఉండాల్సిందే.. నేను తమ్ముడు వైష్ణవ్ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్ లో పెట్టడమే పెద్ద పనిగా ఫీల్ అవుతాం.. కానీ తను మాత్రం ఇన్ని రోజుల నుండి ఎన్నో పనులు చేస్తుంది. ఇన్ని పనులు చేస్తూ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఐఏఎస్ ఆఫీసర్‌ పాత్రలో సాయి ధరమ్ తేజ్

"చిత్ర లహరి ", ప్రతి రోజూ పండగే " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో టాలీవుడ్ లో కొనసాగుతున్న హీరో సాయితేజ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత సక్సెస్ ఫుల్ "ప్రస్థానం " మూవీ ఫేమ్ దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ కి సాయి తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోష‌ల్ మీడియాలో సాయితేజ్ హ‌వా

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా సోషల్ మీడియాదే హ‌వా. అందుకే నిన్నటి తరం అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తమ తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడా తమ అభిమానులను అలరిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే.. రెండు వేర్వేరు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవ‌ర్స్ పరంగా రెండు ల్యాండ్ మార్క్స్‌ను అందుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ డ్రామా గా "#SDT 14"

సక్సెస్ ఫుల్ "చిత్ర లహరి", ప్రతి రోజూ పండగే" మూవీస్ తరువాత సాయి ధరమ్ తేజ్ నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్" మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తరువాత హీరో సాయి తేజ్, "ప్రస్థానం" మూవీ ఫేమ్ దేవా కట్టా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నివేత పేతురాజ్ కథానాయిక.

Team TFNవాట్సాప్
సాంగ్

ఇక రీమిక్స్ చేయను..!

ఇకపై రీమిక్స్ లు జోలికి వెళ్లనంటున్నాడు మెగా మేనల్లుడు సాయి తేజ్. పాపం అంతలా ఎం జరిగింది.. ఈ నిర్ణయం తీసుకోడానికి అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... మెగా స్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాయి తేజ్... మొదటి నుండి కాస్త తన మేన మామలు చిరంజీవిని, పవన్ ను అనుకరిస్తూనే ఉండేవాడు.. అంతే కాదు తన సినిమాల్లో మామ చిరు పాట ఒక్కటైనా రీమిక్స్ ఉండేలా చూసేవాడు. దీనితో సాయితేజ్ అలా చేయడం వల్ల విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా సాయితేజ్ దీనిపై స్పందించి...ఇకపై తన సినిమాల్లో రీమిక్స్ సాంగులు ఉండకుండా చూసుకుంటానని చెప్పాడు. ఈ విషయంపై దర్శక నిర్మాతలు వత్తిడి చేసినా, తాను మాత్రం రీమిక్స్ లు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప‌క్కా మాస్ లుక్ లో సాయితేజ్?

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే` రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన `సుప్రీమ్` హీరో సాయితేజ్... ప్ర‌స్తుతం `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` అనే హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు తెర‌కెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వ‌చ్చే ఏడాది మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ తో నటించాలని ఉంది - సాయి ధరమ్ తేజ్

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన "ప్రతి రోజూ పండగే " మూవీ పాజిటివ్ టాక్ తో విజయవంతం గా ప్రదర్శించబడుతుంది. చిత్ర విజయం పట్ల సాయి ఆనందం వ్యక్తం చేశారు. మల్టీ స్టారర్ మూవీస్ పై తన స్పందన తెలియజేశారు.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej To Play An Interesting Role,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej New Movie News,Sai Dharam Tej Next Film Upddates,Sai Dharam Tej Upcoming Pr
సినిమా వార్తలు

పెళ్ళంటే ప‌డ‌ని యువ‌కుడిగా సాయితేజ్‌?

`చిత్ర‌ల‌హ‌రి` నుంచి కొత్త త‌ర‌హా క‌థాంశాల‌కు, పాత్ర‌ల‌కు పెద్ద పీట వేస్తున్నాడు సాయితేజ్. విడుద‌ల‌కు సిద్ధ‌మైన `ప్ర‌తి రోజూ పండ‌గే`... ఈ త‌ర‌హా చిత్ర‌మే. అంతేకాదు... `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` కూడా సాయితేజ్ ని కొత్త‌గా ఆవిష్క‌రించే చిత్ర‌మ‌ని టాక్. కాగా... ఆ సినిమా క‌థాంశం, క‌థానాయ‌కుడి పాత్రపై టాలీవుడ్ స‌ర్కిల్స్ లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej Coming Up With Another Catchy Title?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej New Movie Updates,Sai Dharam Te
సినిమా వార్తలు

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌` అంటున్న సాయితేజ్‌?

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే`... ఇలా క్యాచీ టైటిల్స్‌తోనే వ‌రుస సినిమాలు చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్‌... త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి కూడా అదే శైలిని కొన‌సాగిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ‘మనీ’ (1993) చిత్రంలోని “భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు” పాట ప‌ల్ల‌విలో వినిపించే `సోలో బ్రతుకే సో బెటర్‌`అనే పంక్తితో సాయితేజ్ కొత్త సినిమా రాబోతుంద‌ని స‌మాచారం. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించ‌నున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్ద‌రు నాయిక‌ల‌కు స్థాన‌ముండ‌గా…

Team TFNవాట్సాప్
Sai Dharam Tej New Movie To Have An Interesting Story,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej Next Film News,Sai Dharam Tej
సినిమా వార్తలు

‘ప్రతి రోజూ పండగే’ అంటున్న సాయితేజ్ ?

‘తాత మనవడు’ నుంచి ‘మా నాన్నకి పెళ్లి’ వరకు మూడు తరాల నేపథ్యంలో సాగే పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా రాబోతోందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Sai Dharam Tej Changes His Name,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sai Dharam Tej Name Changed as Sai Tej,Telugu Actor Sai Dharam Tej Name Changed,Sai Dharam Tej is Now Sai Tej,Sai Dharam Tej Late
సినిమా వార్తలు

పేరు మార్చుకున్న మెగా హీరో

పైన టైటిల్ ను చూసిన వెంటనే.. అదేంటీ మెగా హీరో పేరు మార్చుకున్నాడా..? ఇంతకీ ఏం పేరు మార్చుకున్నాడబ్బా..? ఈ పేరు బానే ఉంది కదా.. ఎందుకు మార్చుకున్నాడు? ఇలా డౌట్ల మీద డౌట్లు వచ్చే ఉంటాయి. అవును నిజంగానే సాయి థరమ్ తేజ్ పేరు మార్చుకున్నాడు. అయితే కొత్త పేరు ఏం పెట్టుకోలేదు కానీ... తనకు ఉన్న పేరునే కాస్త షార్ట్ చేసుకొని మార్చుకున్నాడు. ఇన్ని రోజులు సాయి థరమ్ తేజ్ అని ఉండగా..ఇప్పుడు సాయి తేజ్ గా మార్చుకున్నాడు. ఈ విషయం ఈ రోజు తాను నటించిన చిత్రలహరి సినిమాలోని పరుగు పరుగు పాటను రిలీజ్ చేయగా..అందులో ఉన్న పేరును చూసి అర్ధమైంది. సో ఇక నుండి సాయి థరమ్ తేజ్ కాదు.. సాయి తేజ్ అని పిలవాలన్నమాట.

TFN Adminవాట్సాప్
Sai Dharam Tej To Soon Give A Perfect Reply For Critics,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sai Dharam Tej Latest News,Sai Dharam Tej Upcoming Movie News,Sai Dharam Tej Next Film Details
సినిమా వార్తలు

క్రిటిక్స్ పై తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్

తాను తీయబోయే సినిమాపై సాయి ధరమ్ తేజ్ గట్టి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తేజ్ చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ తొందరలోనే కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్