తాను తీయబోయే సినిమాపై సాయి ధరమ్ తేజ్ గట్టి కాన్ఫిడెన్స్ తోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం తేజ్ చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ తొందరలోనే కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవల తాను చేసిన సినిమాలు పరాజయం పాలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్ క్రిటిక్స్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. తాను చేస్తున్న చిత్రలహరి సినిమా క్రిటిక్స్ అందరికీ సమాధానం చెబుతుందని అన్నాడు. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తండ్రీ కొడుకుల మధ్య ఉండే రిలేషన్ ను చూపిస్తుందని.. అంతేకాదు ప్రతి నిరుద్యోగికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అన్నారు.
కాగా ఈ సినిమాలో సాయి థరమ్ తేజ్ సరసన కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.`శ్రీమంతుడు`, `జనతాగ్యారేజ్`, `రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి సరైన విజయాలు లేక సతమతమవుతున్న తేజ్.. ఈ సినిమాపై బాగానే హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఆ హోప్స్ ఎంత వరకూ నిజమవుతాయో చూద్దాం…
[youtube_video videoid=03Mk3HEzRdM]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: