రామ్ చరణ్-నిఖిల్ ప్రాజెక్ట్ లోకి అనుపమ్ ఖేర్

Anupam Kher Joins For Ram Charan's The India House Project with Nikhil Siddhartha

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, ‘యూవీ క్రియేషన్స్‌’కి చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి ‘వీ మెగా పిక్చర్స్‌’ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే ఈ పతాకంపై తీసే తొలి చిత్రంలో యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్నాడు. ఈ క్రమంలో తమ మొదటి ప్రాజెక్ట్‌కి ‘ది ఇండియా హౌస్’ అనే పేరు కూడా ఇదివరకే ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ చరణ్ ది ఇండియా హౌస్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నాడు. మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్‌ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ అడుగుపెట్టారు. తాజాగా నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్ర బృందాన్ని కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ దిగ్గజ నటుడికి సాదర స్వాగతం పలికింది. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన అనుపమ్ ఖేర్, అందులో.. “నా 542వ చిత్రం – ది ఇండియా హౌస్, పాన్ ఇండియా పీరియడ్ డ్రామాని ప్రకటించినందుకు ఆనందంగా ఉంది!! ప్రియమైన రామ్ చరణ్, నటుడు నిఖిల్, దర్శకుడు రామ్ వంశీకృష్ణ మరియు నిర్మాత అభిషేక్ అగర్వాల్ లకు ధన్యవాదాలు. ఈ వీడియోలో చూపిన ప్రేమ, ప్రశంసలు మరియు గౌరవం కోసం!! జై హో!” అని పేర్కొన్నారు. ఈ వీడియోలో అనుపమ్ ఖేర్ లుక్ పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, సూటు, పంచెలో కళ్లద్దాలు పెట్టుకుని కనిపించడం క్యురియాసిటీని పెంచింది.

కాగా నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన విషయం గుర్తుండేవుంటుంది. దీంతో మరోసారి వీరి కాంబోను రిపీట్ చేయడానికి మేకర్స్ ఉత్సాహంగా ఉన్నారు. ఇక స్వాతంత్య్ర కాలానికి పూర్వం జరిగే కథతో తెరకెక్కనున్న ఈ సినిమా ద్వారా రామ్ వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనుపమ్ ఖేర్ పాత్ర సినిమాలో కీలకంగా ఉందనున్నట్టు సమాచారం. 1905 బ్యాక్‌డ్రాప్‌లో లవ్, రెవెల్యుషన్ థీమ్‌ని ఎక్స్‌ఫ్లోర్ చేసే ఈ పీరియడ్ మూవీలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెమరూన్ బ్రైసన్ డీవోపీ కాగా, విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్‌.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.