ఫ్యామిలీతో ముంబైకి రామ్ చరణ్.. ఎందుకంటే..?

Ram Charan Went For Mumbai with Family to Grace Anant Ambani Wedding Ceremony

గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ గురువారం ముంబైలో మెరిశాడు. ఈ మేరకు సతీమణి ఉపాసన, కుమార్తె క్లిన్‌కారాతో కలిసి ముంబై చేరుకున్న ఆయనను స్థానిక మీడియా కెమెరాల్లో బంధించింది. అయితే ఇలా సడెన్‌గా ఫ్యామిలీతో కలిసి చరణ్ ముంబై వెళ్ళడానికి కారణం ఏంటంటే..? అంబానీల ఇంట వివాహ వేడుకలో పాల్గొనేందుకు వారు ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతకుముందు రామ్ చరణ్ ముంబై బయలుదేరుతున్న విజువల్స్ ట్రెండింగ్‍లో నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‍తో జరుగనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం నుంచి ఆదివారం వరకు, అంటే.. జూలై 12-14 తేదీలలో వీరి కళ్యాణ వేడుకలు జరుగనున్నాయి. ఇక అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‍ పెళ్లి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరుగనుంది. ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు వస్తున్నారు.

అలాగే బాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో మెరవనున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్ ధోని ఫామిలీ, షారుఖ్‌ ఖాన్‌ ఫ్యామిలీ, సల్మాన్‌ ఖాన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌, అనన్య పాండే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే రామ్ చరణ్ దంపతులు ముంబై చేరుకున్నారు. కాగా అంతకుముందు అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌ వేడుకలలో కూడా రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.