‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ రేంజ్లో పాపులర్ అయ్యారు మన టాలీవుడ్ స్టార్ హీరోలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇందులో తెలుగు గడ్డకు చెందిన స్వాతంత్య్ర సమరవీరులు కొమురం భీముడు పాత్రలో ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ అద్భుత నటనను ప్రదర్శించారు. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలావుంటే తాజాగా ఈ ఇద్దరు హీరోలు మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు. తాజాగా ప్రకటించిన 68వ సౌత్ ఇండియా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు 2023వ సంవత్సరానికి గానూ వారు బెస్ట్ యాక్టర్స్ అవార్డుని అందుకున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ డైరెక్టర్ వంటి వాటితోపాటు మొత్తం ఏకంగా 7 విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘దేవర’లో ఆయన నటిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
చరణ్ సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































