టాలీవుడ్ ప్రముఖ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్స్ లిస్టులోకి మరొకరు వచ్చి చేరారు. ఈ మేరకు ఆయన స్వయంగా తన కొత్త స్నేహితుడిని పరిచయం చేశారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై ఆయన ఫ్యాన్స్ స్పందిస్తుండటంతో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఈ కొత్త ఫ్రెండ్ ఎవరు? అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫ్రెండ్ మరెవరో కాదు.. ఆయన ఫామ్ హౌస్ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఒక గుర్రం. అవును మీరు వింటున్నది నిజమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఆయన వద్ద ఎన్నో రకాల జాతుల గుర్రాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తాజాగా పూర్తిగా నలుపు రంగులో ఉన్న మరో మేలు జాతి గుర్రం రామ్ చరణ్ వద్దకు చేరింది. అయితే దీనిని ఆయన కొన్నారా? లేదంటే.. ఎవరైనా బహుమతిగా ఇచ్చారా? అన్న విషయంపై క్లారిటీ లేదు. కాగా చరణ్‌కి గుర్రాలంటే మక్కువ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. హార్స్ రైడింగ్ లో ఆయన టాలెంట్ ఏంటో ‘మగధీర’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలలో మనం ఇదివరకే చూశాం. అయితే ఈ రెండు చిత్రాలను తీసింది దర్శక ధీరుడు రాజమౌళి కావడం విశేషం. చరణ్ లోని ఈ టాలెంట్ ని చూసే రాజమౌళి తన సినిమాల్లో దీనిని బాగా హైలైట్ చేశారని, టాలీవుడ్ లోని హీరోలలో చరణ్ బెస్ట్ హార్స్ రైడర్ అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని చరణ్ అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
View this post on Instagram
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గేమ్ ఛేంజర్’లో ఆయన హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
అయితే చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ నటీనటుల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ప్రస్తుతం వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. కొత్త షెడ్యూల్‌కి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. కాగా సమకాలీన రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, ‘రోబో’ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: