రామ్ చరణ్ చేతుల మీదుగా.. రావు రమేష్ మూవీ ట్రైలర్ రిలీజ్

Global Star Ram Charan Launched Maruthi Nagar Subramanyam Trailer

టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీలో రావు రమేష్ సరసన ఇంద్రజ కథానాయికగా నటించగా.. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఆదివారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. కాగా మారుతి నగర్ సుబ్రమణ్యంతో సుకుమార్ సతీమణి తబిత తొలిసారి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. కంటెంట్ నచ్చడంతో తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తోంది. ఆగస్టు 23న సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించారు.

మారుతి నగర్ సుబ్రమణ్యం ట్రైలర్ ఎలా ఉందంటే..?

ఇక మారుతి నగర్ సుబ్రమణ్యం ట్రైలర్ చూస్తే కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. ఆ కంటెంట్ ఒక ఎత్తు అయితే… రావు రమేష్ నటన మరొక ఎత్తు. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో జీవించారు. ‘అవన్నీ ఓకే’ అని డైలాగ్ చెప్పడంలో, నుదుట నామాలు పెట్టి కుర్చీ తీసిన సన్నివేశంలో ఆయన చూపించిన యాటిట్యూడ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. డైలాగులు బావున్నాయి. సినిమాపై ఈ ట్రైలర్‌ మరిన్ని అంచనాలు పెంచింది.

మారుతి నగర్ వాసి సుబ్రహ్మణ్యానికి ఎటకారం ఎక్కువ. ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి ‘పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది’ అని అడిగితే.. ‘గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను’ అని చెబుతాడు. టైటిల్ రోల్ రావు రమేష్ చేయగా.. ఆయన భార్యగా ఇంద్రజ కనిపించారు. ‘ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వను’ అని ఇంద్రజ డైలాగ్ చెప్పడంతో భర్త సిగరెట్లకు భార్య డబ్బులు ఇస్తోందని అర్థం అవుతుంది.

ఆ వెంటనే ‘నీకు అదృష్టం ఆవగింజ అంత ఉంటే.. దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు’ అని అన్నపూర్ణమ్మ చెప్పారు. ఆవిడ రావు రమేష్ అత్తగారి పాత్ర చేశారు. సుబ్రమణ్యం కుమారుడు ఏమో ‘మా నాన్న అల్లు అరవింద్’ అని గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేశాడు. సుబ్రమణ్యం, అతని కుమారుడు ఏం చేశారు? ఈ కుటుంబ కథ ఏమిటి? అనేది ఆగస్టు 23న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి.

ఇక మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్‌తో పాటు భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ భీమంగని ఆర్ట్ డైరెక్టర్‌గా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు కాగా.. రుషి మర్ల, శివప్రసాద్ మర్ల సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.