
ట్యాగ్ · 32 కథనాలు


లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్

జైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రజినీ మూవీలో సూర్య?

రాజకీయలనుండి అందుకే తప్పుకున్నా

ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్
కాంతార2 మూవీ లో తలైవా రజనీకాంత్ ?

స్పీడు మీదున్న జైలర్

రజినీకాంత్ జైలర్ లో కంప్లీట్ యాక్టర్?

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!

"తలైవర్ 169 "మూవీ అనౌన్స్ మెంట్

కల నిజమైంది -కీర్తి సురేష్

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్

'పెద్దన్న' టీజర్ రిలీజ్

'అన్నాత్తే' టీజర్ రిలీజ్

తలైవా 170 టైటిల్ రిలీజ్
జైలర్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ఆ సినిమా ఇచ్చిన జోష్ తోనే పలు సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమా ఉండగా అందులో జ్ఞానవేల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 170వ సినిమా. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

రజినీకాంత్ ‘జైలర్’లోని 'కావాలయ్యా' పాటకు జపాన్ అంబాసిడర్ స్టెప్పులు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా అందులోని 'కావాలయ్యా' పాట అయితే అంతకుమించి అన్నట్లుగా హిట్ అయింది. ఆ సినిమా విడుదలకు ముందే ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అనిరుధ్ సంగీతానికి తోడు నటి తమన్నా హుక్ స్టెప్ డాన్స్ యావత్ దేశాన్ని ఆకర్షించింది. ఫేస్‌బుక్, యూ ట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ప్రతి ఒక్కరూ ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. రజినీకాంత్ అభిమానులే కాదు.. పలువురు ప్రముఖులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ పాటకు భారతదేశంలోని జపాన్ రాయబారి…

లాల్ సలామ్ రజనీ ఫస్ట లుక్ రిలీజ్
సూపర్ట్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా సినిమాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం రజనీ జైలర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.

జైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన చివరి సినిమా అన్నాత్తే. 2021లో ఆసినిమా రిలీజ్ అయింది. ఇక ఆసినిమా తరువాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమాను ఆగష్ట్ 10 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు చిన్న గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.

రజినీ మూవీలో సూర్య?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోండగా, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో…

రాజకీయలనుండి అందుకే తప్పుకున్నా
తలైవా రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ పై తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినీ పరంగా మాత్రమే కాదు అభిమానులు రజనీకాంత్ పొలిటికల్ గా కూడా రాణించాలని ఆశపడ్డారు. అయితే ముందు రజనీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నారు కానీ ఆ తరువాత రాజకీయాల్లోకి రానని చెప్పి అందరికీ షాకిచ్చారు. దానికి కారణం కూడా చెబుతూ లేఖ విడుదల చేస్తూ అభిమానులను క్షమించమని కోరారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని.. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నానని.. తానిచ్చిన మాటను వెనక్కి…

ప్రారంభం అయిన లాల్ సలామ్ మూవీ షూటింగ్
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఐశ్వర్య దర్శకత్వంలో సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ప్రధాన పాత్రలో క్రీడా మరియు మత కల్లోల కథాంశంతో లాల్ సలామ్ తమిళ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో విష్ణు విశాల్ కథానాయకుడు కాగా విక్రాంత్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లాల్ సలామ్ మూవీలో జీవిత రాజశేఖర్, రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తున్నారు. మార్చి 7న చెన్నైలో ప్రారంభం కానున్న ఈ మూవీ షూట్ లో జీవిత జాయిన్ కానున్నారు.
కాంతార2 మూవీ లో తలైవా రజనీకాంత్ ?
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకత్వంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు. బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. కాంతార మూవీ అన్ని భాషలలోనూ అద్భుత రెస్పాన్స్ సాధించిన విషయం తెలిసిందే. కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.కాంతార మూవీ కి ఓటీటీ లో కూడా అద్భుత స్పందన లభిస్తుంది.

స్పీడు మీదున్న జైలర్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా జైలర్. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమా షూటింగ్ ను మాత్రం రజినీ ఎలాంటి గ్యాప్ లు లేకుండా పూర్తి చేస్తున్నట్టు అర్థమవుతుంది. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక అక్కడ షెడ్యూల్ పూర్తయిందో లేదో అప్పుడే మరో షెడ్యూల్ ను మొదలుపెట్టేశారు. ఈ షెడ్యూల్ కోసం రజనీ…

రిలీజ్ అయిన జైలర్ మూవీ జాకీ ష్రాఫ్ ఫస్ట్ లుక్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ డాక్టర్, బీస్ట్ మూవీస్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ 2023 ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. జైలర్ మూవీలో సునీల్ విలన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

రజినీకాంత్ జైలర్ లో కంప్లీట్ యాక్టర్?
ఈమధ్య సినిమాల్లో అతిధి పాత్రలు కూడా సినిమాలపై ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. అందుకే స్టార్ హీరోలు సైతం అతిథి పాత్రల్లో నటించడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. దానికి ఉదాహరణగా ఈమధ్యకాలంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర గురించి చెప్పొచ్చు. కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉండే ఈపాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇక ఇప్పుడు మరో సూపర్ స్టార్ సినిమాలో ఇంకో సూపర్ స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్నటిస్తున్న జైలర్ సినిమా.

'రజనీ 169'మూవీలో ప్రత్యేకతలు..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒక సినిమా తరువాత ఒక సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇక ప్రస్తుతం రజనీ కాంత్ తన తరువాత సినిమాకోసం రెడీ అవుతున్నారు. రజనీ తన నెక్ట్స్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ సినిమాతో రీసెంట్ గానే నెల్సన్ దిలీప్ కుమార్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు రజనీతో సినిమాకు సిద్దమవుతున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఈసినిమాలో ఇంకా పలు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.

"తలైవర్ 169 "మూవీ అనౌన్స్ మెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త మూవీ అనౌన్స్ మెంట్ కై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రజనీకాంత్ హీరోగా తెరకెక్కే "తలైవర్ 169 "మూవీఅప్ డేట్ ఈ రోజు వచ్చింది. రజనీకాంత్ మూవీ కై తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి తో ఎదురుచూస్తారు.

'అన్నాత్తే' డైరెక్టర్ కు 'సూపర్ స్టార్' మరో ఛాన్స్
ఇండస్ట్రీల్లో హిట్ కాంబినేషన్స్ లో సినిమాలు రావడం చూస్తూనే ఉంటాం. హీరో హీరోయిన్ కాంబినేషన్ లో కానీ, డైరెక్టర్ హీరో కాంబినేషన్ లో ఏ కాంబినేషన్ లో సినిమా హిట్ మరోసారి ఆ కాంబినేషన్ ను రిపీట్ చేస్తారు. ఇక ఇప్పుడు రజినీ కూడా మరోసారి అన్నాత్తే డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. శివ దర్శకత్వంలో రజినీ హీరోగా అన్నాత్తే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. తెలుగులో పెద్దన్న టైటిల్ తో ఈసినిమా రిలీజ్ అయింది. దీపావళి కి రిలీజ్ అయిన ఈసినిమా మంచి రెస్పాన్స్ తో పాటు సాలిడ్ కలెక్షన్స్ ను సైతం దక్కించుకుంది.

కల నిజమైంది -కీర్తి సురేష్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ “పెద్దన్న”మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

'పెద్దన్న' ట్రైలర్ రిలీజ్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అన్నాత్తే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమేషన్స్ జోరుగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే రజినీ అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటున్నారో అవన్నీ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్ స్టైల్, డైలాగ్స్ తో ట్రైలర్ ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలను కూడా పెంచేసింది.

'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ అందుకున్న సూపర్ స్టార్
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు జరిగిన ఈకార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈనేపథ్యంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ను దక్కించుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఈ అవార్డ్ ను అందుకున్నారు సూపర్ స్టార్. ఈ సందర్భంగా రజినీ సోషల్ మీడియా ద్వారా తనకు వచ్చిన అవార్డ్ ను తనకు సీనీ రంగానికి పరిచయంచేసిన కె. బాలచందర్, అలాగే తన సోదరుడు, ఇంకా డైరెక్టర్లు, కోస్టార్లు, ప్రొడ్యూసర్స్, ఫ్యాన్స్ కి అంకితం చేశారు.

'పెద్దన్న' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా అన్నాత్తే. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తెలుగులో ఈసినిమాను పెద్దన్న అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు…

రజనీకాంత్ "పెద్దన్న "మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తలైవా రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "పెద్దన్న"మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానున్నాయి. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలలో నటించారు. ప్రకాష్ రాజ్ , జగపతి బాబు , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

'అన్నాత్తే' టీజర్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అన్ని అడ్డంకులను దాటుకొని ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.