రాజకీయలనుండి అందుకే తప్పుకున్నా

Why Rajinikanth Far Away From Politics Heres The Reason

తలైవా రజినీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ పై తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సినీ పరంగా మాత్రమే కాదు అభిమానులు రజనీకాంత్ పొలిటికల్ గా కూడా రాణించాలని ఆశపడ్డారు. అయితే ముందు రజనీ రాజకీయాల్లోకి వద్దామనుకున్నారు కానీ ఆ తరువాత రాజకీయాల్లోకి రానని చెప్పి అందరికీ షాకిచ్చారు. దానికి కారణం కూడా చెబుతూ లేఖ విడుదల చేస్తూ అభిమానులను క్షమించమని కోరారు. అనారోగ్య కారణాల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని.. రాజకీయ ప్రకటనకు ముందు ఆసుపత్రిలో తాను చేరడమనేది దేవుడి హెచ్చరికగా భావిస్తున్నానని.. తానిచ్చిన మాటను వెనక్కి తీసుకోవడంపై తనను క్షమించాలంటూ అప్పట్లో అభిమానులను కోరారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరోసారి రాజకీయాల స్పందించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు తలైవా. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు ఆయన చెప్పారు. అనారోగ్య సమస్యలతో రాజకీయాల్లోకి వస్తే తన ఆరోగ్యానికి మంచిది కాదు అని, డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని.. అయితే ముందు ఆ మాటలను సీరియస్ గా తీసుకోలేదు.. కానీ ఆతరువాత బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది..అందుకనే ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.. తాను ఈ విషయాలు అప్పుడే చెప్పి ఉంటే.. తాను భయపడుతున్నానని అందరూ అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పారు.

కాగా ఈ వయసులో కూడా రజనీకాంత్ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. రజనీకాంత్ కెరీర్ లో వస్తున్న 169 సినిమా ఇంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న రిలీజ్‌ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here