కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Puri Jagannadh Latest News

ట్యాగ్ · 15 కథనాలు

సినిమా వార్తలు

'ఆకాష్' కు 'పూరీ' సపోర్ట్ - నీకు ఏది నచ్చితే అది చెయ్..!

నేడు డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. ఇక కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే ఆకాష్ పూరీ తన పుట్టినరోజు వేడుకలను ఎక్కడా జరపవద్దని లేఖను ను కూడా విడుదల చేశాడు. మరోవైపు ఈ సందర్భంగా ఈ కుర్ర హీరోకి పలువురు సినీ సెలబ్రిటీస్ పుట్టిన రోజులు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

TFN Adminవాట్సాప్
Tollywood Ace Director Puri Jagannadh Pens A Heart Warming Note To Actress Anushka Shetty
సినిమా వార్తలు

'అనుష్క'ను చూస్తుంటే గర్వంగా ఉంది..!

అరుంధతి, భాగమతి, రుద్రమదేవి,దేవసేన ఈ పేర్లు వింటే చాలు మనకు గుర్తొచ్చేపేరు అనుష్క. నేటి తరం నాయకులకు లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు తీయడానికి ఒక రకంగా అనుష్కనే స్పూర్తి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. మొన్ననే ఈ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా.. పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్‌లో.. అనుష్కపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేసాడు. "ఆ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు నాగార్జున గారు. మా అనుష్క మొదటి సినిమా సూపర్ రిలీజ్ అయిన రోజు. సూపర్ నుండి నిశ్శబ్దం వరకు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తుంటే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'జనగణమన' నా డ్రీమ్ ప్రాజెక్ట్..!

పూరీ 'జనగణమన' సినిమా గురించి గత కొన్నాళ్లుగా వింటూనే ఉన్నాం. గతంలో మహేష్ తో అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఇక ఆ తర్వాత పలు సినిమాలు తీశాడు కానీ వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇక గత ఏడాది ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పూరీ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ తో ఫైటర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఫైటర్' ఒరిజినల్ టైటిల్ పై అప్ డేట్ ..!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ప్యాకప్ చెప్పుకొని ఇక్కడికి వచ్చేసారు. మరి షూటింగ్ కు ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం ఇంకా తెలీదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ల్మాన్ ఖాన్?

గత ఏడాది విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’తో మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశాడు స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ప్రస్తుతం యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఓ స్పోర్ట్స్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు పూరి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూరీ జగన్నాథ్ మరో పాన్ ఇండియా మూవీ

'ఇస్మార్ట్' డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. నిర్మాణ దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నాయికగా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుందని తెలిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఫైట‌ర్’ కోసం సెంటిమెంట్‌ ఫాలో అవుతున్న పూరీ జ‌గ‌న్నాథ్‌?

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక్కో ద‌ర్శ‌కుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ముఖ్యంగా టైటిల్స్ విష‌యంలో. “క‌ళాత‌ప‌స్వి” కె.విశ్వనాథ్‌, భీమ‌నేని శ్రీ‌నివాసరావుకు ‘స‌’,’శ‌’ అక్ష‌రాలు.. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు ‘అ’ అనే అక్షరం టైటిల్స్‌లో ప్రథమాక్షరంగా చాలా సంద‌ర్భాల్లో క‌లిసిరాగా.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ‌కు టైటిల్ చివ‌ర‌లో ‘పూర్ణాక్ష‌రం’ (‘చిత్రం’, ‘జయం’.. ఇలా) ఉండ‌డం అచ్చొచ్చింది. వీరిలాగే ‘ఇస్మార్ట్’ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌కి కూడా త‌న సినిమాల టైటిల్స్‌ విషయంలో ఓ సెంటిమెంట్ ఉంది.

Team TFNవాట్సాప్
Actor Vijay Deverakonda Recollects His Special Memory With Puri Jagannadh Debut Movie Badri
సినిమా వార్తలు

నేను రిటైర్ అయ్యేంత వరకూ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి..!

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఒక రకంగా పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. దీనితో మరోసారి ఈ సినిమాను సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు పవన్, పూరీ ఫ్యాన్స్. ఇప్పటికే రేణు దేశాయ్ ఈ సినిమా షూటింగ్ లో ఎంత కష్టపడిందో చెప్పుకొస్తూ... అప్పటి షూటింగ్ కు సంబంధించి కొన్ని రేర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.

TFN Adminవాట్సాప్
Sensational Director Puri Jagannadh Completes 20 Years In Tollywood
సినిమా వార్తలు

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి

సూపర్ హిట్ "బద్రి " మూవీ తో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మేన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
Sensational Director Puri Jagannadh Debut Movie Badri Completes 20 Years
సినిమా వార్తలు

పూరీ జ‌గ‌న్నాథ్ తొలి చిత్రం ‘బద్రి’కి 20 వసంతాలు

క‌థానాయ‌కుల‌ను కొత్తగా ఆవిష్కరించడంలో ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తీరే వేరు. ఆయ‌న తెర‌కెక్కించిన ప్ర‌తీ చిత్రంలోనూ ఇదే శైలిని కొన‌సాగించారు, కొనసాగిస్తున్నారు. అంతేకాదు.. తెలుగులో అన్ని వ‌ర్గాల కథానాయకులతోనూ సినిమాలు చేసిన వైనం పూరి సొంతం. అలాంటి పూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తొలి చిత్రం ‘బద్రి’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో.. పవన్‌ను గత చిత్రాలకంటే డిఫరెంట్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేశారు పూరి. “నువ్వు నందా అయితే ఏంటి? నేను బ‌ద్రి.. బ‌ద్రీనాథ్‌” అని ప‌వ‌న్ చేత చెప్పించిన‌ డైలాగ్ ఇప్ప‌టికీ సంచ‌ల‌న‌మే. అలా ఫ‌స్ట్ మూవీతోనే త‌ను ఒక డిఫ‌రెంట్ డైరెక్ట‌ర్ అని…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరో కోసం కథ సిద్ధం చేస్తున్న పూరీ..!

లాక్ డౌన్ సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు జోరుగా ప్రచారం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే... ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడట. ఆ అగ్ర హీరో ఎవరో కాదు.. మెగా స్టార్ చిరంజీవి. నిజానికి 150వ సినిమాను పూరీనే తెర‌కెక్కించాల్సి ఉంది. దీనికి ఆటోజానీ అనే టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు పూరీ. అయితే స్టోరీ అంత నచ్చకపోవడంతో చిరు వెనక్కి తగ్గాడు. ఇప్పుడు మరోసారి.. చిరు కోసం పూరీ స్క్రిప్ట్ ను రాసే పనిలో వున్నాడట. అంతేకాదు తాజాగా అభిమానులతో మాట్లాడుతూ స్టార్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లాక్ డౌన్ ను సూపర్ గా వాడుకుంటున్న పూరీ..!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కేవలం నిత్యావసర సరుకులు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే తప్పా బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. చాలా మంది ఇంట్లోనే ఉంటూ కరోనా ఇచ్చిన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం ఇంట్లోనే ఉంటూ... ఫ్యామిలీతో... ఆట పాటలతో.. ఇంకొంతమంది గరిటె చేతబట్టి వంటలు చేస్తూ.. ఇలా పలు పనుల్లో బిజీ అయిపోయారు. కొందరు హీరోలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే వీడియోలు తీస్తుంటే. మరికొందరు పాటల రూపంలో జాగ్రత్తలు చెబుతున్నారు. ఇక కొంతమంది దర్శకులు అయితే కొత్త స్క్రిప్టులకు పనిచెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
Director Puri Jagannadh Sends Out His Video Message To Public On Lockdown
సినిమా వార్తలు

లాక్ డౌన్ నేపథ్యంలో పూరి జగన్నాథ్ మెసేజ్

కరోనా మహమ్మారి కారణంగా ప్రధాని 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. కొంత మంది పరిస్థితులను అర్థం చేసుకోకుండా బయట తిరుగుతున్నారు. దానికి పర్యవసానం ప్రజలందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రతీ ఒక్కరూ స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని పూరి జగన్నాథ్ కోరారు.

Team TFNవాట్సాప్
Puri Jagannadh Join Hands With Pawan Kalyan For Jana Gana Mana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Puri Jagannadh,Puri Jagannadh Latest News,Puri Jagannadh New Movie News,Pawan Kalyan,Jana Gana Man
సినిమా వార్తలు

పవన్ తో పూరీ 'జనగణమన'..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు వచ్చింది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. వీటితో పాటు ఫైనల్ అయిన మరో సినిమా హరీష్ శంకర్ తో. ఈ రెండు…

TFN Adminవాట్సాప్
Puri Jagannadh Goes To Mumbai
సినిమా వార్తలు

జాన్వీ కోసం ముంబైకే మకాం మార్చిన పూరీ..!

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

TFN Adminవాట్సాప్

షేర్