పవన్ తో పూరీ ‘జనగణమన’..?

Puri Jagannadh Join Hands With Pawan Kalyan For Jana Gana Mana,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Puri Jagannadh,Puri Jagannadh Latest News,Puri Jagannadh New Movie News,Pawan Kalyan,Jana Gana Mana,Jana Gana Mana Movie,Jana Gana Mana Telugu Movie,Jana Gana Mana Movie Updates,Jana Gana Mana Telugu Movie Latest News

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ‘వకీల్ సాబ్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీ‌రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆఖరి దశకు వచ్చింది. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి మే 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. వీటితో పాటు ఫైనల్ అయిన మరో సినిమా హరీష్ శంకర్ తో. ఈ రెండు సినిమాల తర్వాత పవన్, హరీష్ సినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ సినిమాల తర్వాత పవన్-పూరీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాథ్ తో ఒక సినిమాను చేయడానికి పవర్ స్టార్ సిద్ధంగా ఉన్నారట. ఇక పూరీ కూడా తన దగ్గర ఉన్న ‘జనగణమన’ సినిమాను ఒక స్టార్ హీరో తో తీయాలని చూస్తున్నాడు. గతంలో మహేష్ తో అనుకున్నాడు కానీ అది కుదరలేదు. ఇప్పుడు పూరీ ఈ కథను పవన్ తో చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ ను సీఎం గా చూపించబోతున్నాడట… ప్రస్తుతం ఉన్న మూడు సినిమాలు అయిపోయిన తర్వాత ‘జనగణమన’ కథను కూడా సెట్స్ పైకి తేవాలని ఆలోచిస్తున్నాడట. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.