
ట్యాగ్ · 656 కథనాలు


బాహుబలి: ది ఎపిక్.. బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్

కల్కి సీక్వెల్ నుండి దీపికా పదుకొణే ఔట్!

స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి అంటే..?

సలార్ రీ రిలీజ్ క్రేజ్ మాములుగా లేదు

ది రాజా సాబ్ టీజర్ ఎప్పుడొచ్చినా పండగే

ప్రభాస్‌తో అనుపమ్ ఖేర్, పిక్స్ వైరల్

బ్రహ్మా ఆనందం ట్రైలర్ చూశారా?

యువతకు ప్రభాస్ ప్రత్యేక సందేశం

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న కల్కి 2898 AD

ప్రభాస్ ఫ్యాన్స్‌కి కన్నప్ప టీమ్ విజ్ఞప్తి

ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్

సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్

ప్రభాస్ హను మూవీ షూట్ అప్డేట్

అన్ని ఫార్మాట్లలో రిలీజవుతోన్న బాహుబలి ది ఎపిక్
భారత సినీ చరిత్రను మార్చిన మాస్టర్‌పీస్ 'బాహుబలి: ది బిగినింగ్' మరియు దాని సీక్వెల్ 'బాహుబలి: ది కంక్లూజన్' చిత్రాలు మళ్లీ భారీ తెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

బాహుబలి: ది ఎపిక్.. బజ్ పెంచిన సెంథిల్ ట్వీట్
భారతీయ సినీ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిన 'బాహుబలి' ప్రపంచాన్ని మరోసారి తెరపైకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ నుండి రాబోతున్న ప్రత్యేక ప్రాజెక్ట్ "బాహుబలి: ది ఎపిక్" గురించి తాజాగా కీలక అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ గారు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కలర్ గ్రేడింగ్ పూర్తయినట్టు ప్రకటించారు.

కల్కి సీక్వెల్ నుండి దీపికా పదుకొణే ఔట్!
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా రూ.1,000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ చిత్రం సీక్వెల్‌కి సంబంధించిన ఒక కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సీక్వెల్‌లో హీరోయిన్ దీపికా పదుకొణే భాగం కాబోరని, తాము ఆమెతో విడిపోతున్నామని నిర్మాతలు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించారు.

స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పటినుండి అంటే..?
వరుస పాన్-ఇండియా హిట్స్ అందించిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్పిరిట్' లోకి ఎంటరవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. హై-ఆక్టేన్ పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం సంచలనం క్రియేట్ చేసే పవర్ ఫుల్ కొలాబరేషన్‌ని చూస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా త్రిప్తి దిమ్రి కనిపించనుంది.

సలార్ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్ వసూళ్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

సలార్ రీ రిలీజ్ క్రేజ్ మాములుగా లేదు
వరస ప్లాప్ ల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి వచ్చాడు. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈసినిమా 2023 చివర్లో వచ్చి 600కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.అయితే సరైన టైం లో వచ్చి ఉంటే 1000కోట్ల సినిమా అయ్యుండేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీల్ అవుతూవుంటారు.యునానిమస్ గా హిట్ టాక్ తెచ్చుకుంది ఈసినిమా.కేవలం థియేటర్లలోనే కాదు ఓటిటి ల్లోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హిందీ వెర్షన్ చాలా రోజులు ట్రెండింగ్ లో కొనసాగింది.ఇందులో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. రీరిలీజ్ కానున్న సలార్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్, కల్కి 2898 AD' చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. వీటి సీక్వెల్స్ లోనూ ఆయన నటించనున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రధానపాత్రలో రెండు కొత్త చిత్రాలు రూపొందుతున్నాయి.

ది రాజా సాబ్ టీజర్ ఎప్పుడొచ్చినా పండగే
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్', కల్కి 2898 AD' సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. కల్కి రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా, అంతకుముందు వచ్చిన సలార్ దాదాపు రూ. 800 కోట్లు సాధించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.

ప్రభాస్‌తో అనుపమ్ ఖేర్, పిక్స్ వైరల్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే 'సలార్, కల్కి' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఆయన ఇప్పుడు వాటి సీక్వెల్స్ లోనూ నటించబోతున్నాడు. మరోవైపు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆల్మోస్ట్ పూర్తికావొచ్చింది.

బ్రహ్మా ఆనందం ట్రైలర్ చూశారా?
టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు.

కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రివీల్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు.

కన్నప్ప.. ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు. ఈ సినిమాలోని విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.

యువతకు ప్రభాస్ ప్రత్యేక సందేశం
పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ యువతకు ప్రత్యేక సందేశం అందించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్‌నెస్ ఇనిషియేటివ్‌కు మద్దతుగా ఆయన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు కీలక సూచన చేసిన విషయం తెలిసిందే.

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' లాంచ్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'స్పిరిట్'. ఇది ప్రకటించినప్పటినుంచే ఈ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న మూవీ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ విపరీతంగా వుంది.

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న కల్కి 2898 AD
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కి కన్నప్ప టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప’. 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పలువురు తెలుగు నటులే కాకుండా పలువురు తమిళ, కన్నడ, హిందీ నటీనటులు భాగం కానున్నారు. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ సహా భారీ తారాగణం నటిస్తోంది. అలాగే విష్ణు తనయుడు అవ్రామ్ మంచు తిన్నడు అనే పాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ప్రభాస్‌తో హోంబలే ఫిల్మ్స్ మెగా కొలాబరేషన్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, కల్కి 2, ఫౌజీతో ఎక్స్‌ట్రార్డినరీ ప్రాజెక్ట్‌లను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మ్యాసీవ్ స్కేల్‌లో రూపొందే మూడు మెగా సినిమాల కోసం ఆయన చేతులు కలిపారు. ఈ హిస్టారికల్ కొలాబరేషన్‌లో సలార్ పార్ట్ 2 తర్వాత, ఎడిషినల్‌గా రెండు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రానున్నాయి.

సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘సలార్: పార్ట్ 1-సీజ్‌ఫైర్’. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ప్రభాస్ హను మూవీ షూట్ అప్డేట్
రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ తమిళనాడు లోని కరైకుడి లో స్టార్ట్ అయ్యింది.ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ ప్రారంభం కాగా కొద్దీ రోజుల క్రితం ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు.ఇక ఈరోజుతో మొదటి షెడ్యూల్ పూర్తి కానుంది.నవంబర్ చివర్లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.త్వరలోనే ఈసినిమానుండి అప్డేట్ రానుంది.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రలు చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో…

ఈశ్వర్ రీ రిలీజ్.. థియేటర్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి, గోపీచంద్, బాబీ, అనిల్ రావిపూడి సహా ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.