పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’, కల్కి 2898 AD’ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. కల్కి రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా, అంతకుముందు వచ్చిన సలార్ దాదాపు రూ. 800 కోట్లు సాధించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం హీరోగా రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్యాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందుతుండగా.. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో ముందుగా ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే రాజా సాబ్ నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ను రిలీజ్ చేయగా.. సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటిదాకా చేయని పాత్రలో కనిపించనున్నాడు. రొమాంటిక్ హారర్ జానర్‌లో దీనిని దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. అలాగే ఇందులో 6 పాటలు ఉంటాయని, వీటితోపాటు ఒక రీమిక్స్ సాంగ్ కూడా ఉంటుందని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇప్పటికే వెల్లడించాడు.
దీంతో ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే రాజా సాబ్ టీజర్ రానుంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలను రెట్టింపు చేస్తూ నిర్మాత ఎస్కేఎన్ దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. “రాజా సాబ్ టీజర్ ఎప్పుడు వచ్చినా.. గోదావరి జిల్లాల ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్‌గా కనెక్ట్ అయిపోయి, పండగ చేసుకునేలా వుంటుందని ఇన్ సైడ్ టాక్” అని వ్యాఖ్యానించారు.
ఇక టాలీవుడ్‌లో సూపర్ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తద్వారా రాజా సాబ్ ప్రాజెక్ట్ తమ సంస్థలో ఒక మెమొరబుల్ మూవీగా మిగిలిపోవాలని భావిస్తున్నారు. వివేక్ కూఛిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: