పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కనున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఇది ప్రకటించినప్పటినుంచే ఈ సినిమాపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్ట్ చేయబోతున్న మూవీ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీ విపరీతంగా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని రెబెల్ స్టార్ ఫ్యాన్స్ చాలా రోజులుగా తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఒక వేడుకలో మాట్లాడుతూ స్పిరిట్‌లో ప్రభాస్ క్యారక్టర్ ఎలా ఉండబోతుందో తెలిపారు. ఇందులో రెబెల్ స్టార్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని, అది కూడా చాలా వైల్డ్‌గా ఉండబోతుందని వెల్లడించారు.
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన సందీప్ వంగా.. ఈ చిత్రాన్ని వాటికి మించేలా తీయనున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటినుంచే దీనిపై భారీ అంచనాలు పెట్టేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి సాలిడ్ అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలవబోతుంది.
కాగా స్పిరిట్ ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్టుగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. కాగా స్పిరిట్ చిత్రాన్ని టీ-సిరీస్ భాగస్వామ్యంతో సందీప్ రెడ్డి వంగా స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ఇక యానిమల్ మూవీకి కూడా ఆయన కోప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. మరోవైపు సలార్, కల్కి 2898 AD వంటి సూపర్ హిట్స్ తర్వాత ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’, హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు.
అలాగే ఇంకోవైపు కల్కి, సలార్ సినిమాలకు సీక్వెల్స్ కూడా చేయబోతున్నారు. ఇక ఇవి సెట్స్ పైన ఉండగానే, స్పిరిట్ కూడా త్వరలోనే పట్టాలెక్కనుండటం గమనార్హం. ఇక మరోవైపు కల్కి జపాన్‌లో న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 3న రిలీజ్ కాబోతుంది. ఈ వరుస అప్‌డేట్లతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా ఉంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: