టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ఇంతకుముందు ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండేవుంటుంది. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో విభిన్న పాత్రలను పోషించిన దిగ్గజ నటీనటుల పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ చిత్రంపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుంచి మోహన్ బాబు, మోహన్ లాల్, మధుబాల, శరత్ కుమార్, దేవరాజ్, హీరోయిన్ ప్రీతి ముఖుంధన్.. అలాగే రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి వారు పోషించిన పాత్రల పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచింది.
కాగా అక్షయ్ కుమార్ కన్నప్పలో మహా శివుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు అభిమానులకు మరో అదిరిపోయే గిఫ్ట్ అందించింది చిత్ర యూనిట్. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్.
ఈ మేరకు ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా.. “కన్నప్పలో తిరుగులేని రక్షకునిగా బలం మరియు వివేకం యొక్క స్వరూపం. భక్తి, త్యాగం మరియు ప్రేమతో కలకాలం సాగే ప్రయాణం” అని పేర్కొన్నాడు. దీన్నిబట్టి ప్రభాస్ కన్నప్పలో ‘రుద్ర’ అనే అతి ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు అర్ధమవుతోంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ విడుదల చేసిన కాసేపట్లోనే వైరల్ గా మారింది.
ఇక ప్రభాస్ క్యారక్టర్ ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ లో మహాశివుని రూపం కనిపిస్తుండగా.. ప్రభాస్ నుదిటిపై విభూది రేఖలతో, చేతిలో దండంతో, మెడలో రుద్రాక్షలతో, నలుపు రంగు వస్త్రాలతో గంభీరమైన వదనంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. దీంతో ఆయన రోల్ ఎలా ఉండబోతుందో? ఏ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు? అని ఎదురుచూసిన ఆయన అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఈ లుక్ చూశాక ఫిదా అవుతున్నారు.
ఇకపోతే, ఈ వరుస అప్డేట్స్ మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. కన్నప్ప చిత్రంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు నటిస్తున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మలుస్తున్న చిత్ర యూనిట్.. ఏప్రిల్ 25, 2025న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: