పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్, కల్కి 2898 AD’ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. వీటి సీక్వెల్స్ లోనూ ఆయన నటించనున్నారు. మరోవైపు ప్రభాస్ ప్రధానపాత్రలో రెండు కొత్త చిత్రాలు రూపొందుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజాసాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ఇంకోటి సెట్స్ పైన ఉన్నాయి. ఇందులో ముందుగా ‘ది రాజాసాబ్’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు ప్రభాస్. ఇంతకుముందెన్నడూ ఆయన ట్రై చేయని హర్రర్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుండటంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది. అదేంటంటే..? ‘సలార్: పార్ట్ 1 – సీజ్ ఫైర్’ చిత్రం త్వరలో రీరిలీజ్ కానుంది. వచ్చే నెల 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో రీరిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఆరోజు సలార్ స్పెషల్ షోలను ప్రదర్శించనున్నారు. దీంతో డార్లింగ్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది.
అందుకే రెబెల్ స్టార్ ఫ్యాన్స్ దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ దీనిని షేర్ చేస్తున్నారు. ఆరోజు ప్రభాస్ అభిమానులందరూ ఈ చిత్రాన్ని వీక్షించేందుకు రావాలని కోరుతూ పోస్టులు పెడుతున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ విజువల్స్ తోనూ మూవీ లవర్స్‌ని ఆకట్టుకుంది.
ముఖ్యంగా, సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చాయి. అదేవిధంగా ఖాన్సార్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్‌లు కూడా బాగున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్‌ను.. ప్రతి ట్రాక్‌ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దారు. దీంతో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ సినిమా పార్ట్-2పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక సలార్ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. అలాగే జగపతి బాబు, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో సలార్ మరోసారి విడుదలకానుండటంతో అంతటా ఆసక్తి నెలకొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: