పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘సలార్, కల్కి’ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఆయన ఇప్పుడు వాటి సీక్వెల్స్ లోనూ నటించబోతున్నాడు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆల్మోస్ట్ పూర్తికావొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, దీనికి పారలల్‌గా క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తుంది. వెటరన్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ దిగ్గజ నటుడు అడుగుపెట్టారు. ‘కార్తికేయ 2’ తో తెలుగువారికి పరిచయమైన స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న ఆయన తాజాగా సెట్స్ నుంచి ప్రభాస్‌తో దిగిన ఫొటోలు పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా అనుపమ్ ఖేర్ ఒక పోస్ట్ పెట్టారు. “నా 544వ సినిమా ఇండియన్ సినిమాకు బాహుబలి అయిన ప్రభాస్ తో చేస్తున్నాను. ఈ సినిమాకు టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అలాగే నా స్నేహితుడు బ్రిలియంట్ కెమెరామెన్ సుదీప్ ఛటర్జీ ఈ సినిమాకు డీవోపీగా చేస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన కథ. జీవితంలో ఇంకేం కావాలి” అని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలు, ప్రపంచ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కోసం టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సుదీప్ ఛటర్జీ ISC సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ కాగా, అనిల్ విలాస్ జాదవ్ ప్రొడక్షన్ డిజైనింగ్ సమకూరుస్తున్నారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























