పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఈ క్రమంలో దేశ, విదేశాల్లో పలు రికార్డులను బద్దలు కొట్టిన కల్కి ఆగస్ట్ 22న ఓటీటీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మ్యాసీవ్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ బస్టర్ జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. షోగాట్సు ఫెస్టివల్‌లో భాగంగా జనవరి 3న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ట్విన్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్న ‘కల్కి 2898 AD’ గ్లోబల్ జర్నీలో మరో అధ్యాయాన్ని నాంది పలుకుతోంది. పురాణాలు, ఫ్యూచరిజంకు ఆవాసమైన జపాన్‌లో ఈ లార్జర్ దెన్ లైఫ్ మూవీ సందడి చేయబోతోంది.
ఇంతకుముందు తన చిత్రాలతో ప్రభాస్ జపనీస్ ప్రేక్షకులలో విశేషమైన ఆదరణ పొందారు. వీరిలో చాలా మంది ఈ చిత్రాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఇండియాకి వచ్చారు. ఈ నేపథ్యంలో ‘కల్కి 2898 AD’ జపాన్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నందున, ప్రేక్షకులు నిజంగా అవుట్ అఫ్ థిస్ వరల్డ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఆశించవచ్చు, ఇది భారతీయ పురాణాలు, లెగసీ, టైమ్ లెస్ హీరోయిజంని అందించనుంది.
కాగా కల్కి చిత్రంలో ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా కల్కి 2ను తెరకెక్కించడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ వెల్లడించనున్నారు.
డిస్టోపియన్ యూనివర్స్ నుంచి వారియర్‌గా భైరవ (ప్రభాస్) భారతీయ ఇతిహాసం ‘మహాభారతం’ నుండి అమరుడైన అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ పాత్రలో విజువల్ వండర్ రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. పౌరాణిక వైభవాన్ని భవిష్యత్‌తో బ్లెండ్ చేసిన కథనంలో సుమతిగా దీపికా పదుకొణె నటించారు. లోకనాయకుడు కమల్ హాసన్ మూవీలో కీలకమైన సుప్రీమ్ యాస్కిన్‌గా భయపెట్టారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: