టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్‌తో ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ చేయడం విశేషం. ట్రైలర్ ఆద్యంతం నవ్విస్తూనే ఎమోషనల్‌కు గురిచేసింది. చూస్తుంటే.. ఇది ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనే విషయం అర్ధమవుతోంది.
ఇక బ్రహ్మా ఆనందం ట్రైలర్ గమనిస్తే.. బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ మనవడిగా కనిపించగా.. ఆయనకు తాతగా బ్రహ్మి తనదైన నటనతో రక్తి కట్టించారు. స్వార్థపరుడైన కథానాయకుడి అవసరాన్ని తెలుసుకున్న ఓ తాత అతడిని మార్చడానికి చేసే ప్రయత్నమే బ్రహ్మా ఆనందం. కొన్నిరోజుల పాటు తన స్వార్థం పక్కన పెట్టి.. తోటివారి కోసం ఆలోచించాలనే కండీషన్‌తో మనవడిలో తాత మార్పు తీసుకువస్తాడా? లేదా? అనేది కీలకంగా చూపించాడు దర్శకుడు.
RVS నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న బ్రహ్మా ఆనందంలో ప్రియా వడ్లమాని మరియు ఐశ్వర్య హొలక్కల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శాండిల్య పిసాపాటి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: