సలార్ 2.. త్వరలో షూటింగ్ స్టార్ట్

Hombale Films Calls Rebel Star Prabhas To Join For Salaar 2 Shooting

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘సలార్‌: పార్ట్ 1-సీజ్‌ఫైర్’. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రభాస్ కటౌట్‌కి సరిగ్గా సరిపోయే కథతో, యాక్షన్ సీక్వెన్స్‌లో ఎలివేషన్ సీన్స్‌కి థియేటర్లో ఆడియెన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించాడు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా విలన్లను ప్రభాస్ ఊచకోత కోస్తుంటే.. సగటు ప్రేక్షకుడు సంభ్రమాశ్చర్యాలతో అలా చూస్తుండిపోతాడంటే అతిశయోక్తి కాదు. ఇక సలార్ క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ అయితే అదిరిపోయింది. దీంతో పార్ట్ 2పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

రెండో భాగానికి ‘శౌర్యంగ‌ ప‌ర్వం’ అనే టైటిల్ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేశారు. ఇక సలార్ పార్ట్ 1లోని కొన్ని పాత్రలపై ఉన్న సందేహాలు, ప్రశ్నలకు సలార్ 2లో ఎలా సమాధానం ఇస్తారో అని, అలాగే ఈ చిత్రం ఇంకెలా ఉండనుందో అని ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సలార్ 2 షూటింగ్, రిలీజ్ గురించి చిత్ర నిర్మాత, హోంబలే ఫిలిమ్స్‌ అధినేత విజయ్ కిరగందూర్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వెల్లడించారు.

ఈ సందర్భంగా.. “సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రభాస్, ప్రశాంత్ కూడా వీలైనంత త్వరగా దీనిని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. సలార్ 1 రాబోయే పార్ట్ 2కి ఒక ట్రైలర్‌లాంటిది. కథలో భారీ యాక్షన్ సీక్వెన్స్, డ్రామా, పాలిటిక్స్ అంశాలతో సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఉంటుంది. దర్శకుడు పార్ట్ 1లో పాత్రలన్నింటిని పరిచయం చేశారు. వాటికి కొనసాగింపుగా సీక్వెల్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయి” అని నిర్మాత కిరగందూర్ చెప్పారు.

కాగా సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ ముఖ్య పాత్రలో కనిపించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, బాబీ సింహా, ఈశ్వరీ రావు, శ్రియారెడ్డి, జాన్ విజయ్‌, సప్తగిరి, సిమ్రత్‌ కౌర్‌, పృథ్విరాజ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు భువన్ గౌడ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.