పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ యువతకు ప్రత్యేక సందేశం అందించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక అవేర్నెస్ ఇనిషియేటివ్‌కు మద్దతుగా ఆయన ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమకు కీలక సూచన చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా ‘సే నో టు డ్రగ్స్’ అనే ప్రచారంలో భాగంగా సినీ ప్రముఖులు యువతకు దీనిపట్ల అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అప్పటినుంచి పలువురు స్టార్ హీరోలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కమల్ హాసన్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, శ్రీలీల తదితరులు ప్రత్యేక వీడియోలు రిలీజ్ చేశారు.
ఈ క్రమంలో తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ యువతకు సందేశం ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అందులో.. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మనకోసం జీవించే, మనల్ని ప్రేమించే వ్యక్తులు మనచుట్టూ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? ‘సే నో టు డ్రగ్స్ టుడే’. మీకు తెలిసినవారిలో ఎవరైనా డ్రగ్స్‌కు అడిక్ట్ అయినట్లయితే ప్రభుత్వానికి సమాచారం అందించి, వారు కోలుకోవడానికి సహకరించండి” అని ఆయన కోరారు.
ఇకఇదిలావుంటే, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రెండు చిత్రాలు సెట్స్ పైన ఉన్నాయి. మారుతి డైరెక్షన్లో ‘ది రాజాసాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ‘కల్కి 2’ మరియు ప్రశాంత్ నీల్ రూపొందించే ‘సలార్ 2’ సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























