
ట్యాగ్ · 14 కథనాలు


యంగ్ హీరో 'నిఖిల్' తండ్రి కన్నుమూత

పాండమిక్ ఎఫెక్ట్ కెరీర్స్ పై చాలా పడింది..!

నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా..!

షూట్ మోడ్ లో నిఖిల్

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది
దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్
సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్
హీరో నిఖిల్ భావోద్వేగం
లాక్ డౌన్ పై నిఖిల్ ట్వీట్
నిఖిల్ కు జోడీ గా సిద్ధి ఇద్నాని
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!

బెస్ట్ పాపులర్ ఛాయిస్ అవార్డ్ గెలుచుకున్న నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజేస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో కార్తికేయ 2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మనం ఎలా బతకాలో శ్రీకృష్ణుడు చెప్పిన విధానాన్ని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు చందూ. హిందీలో కూడా ఈసినిమా సూపర్ హిట్ తో దూసుకుపోయింది. దీంతో ఈసినిమా పాన్ ఇండియా స్టార్‌గా నిఖిల్ ను నిలబెట్టింది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా వల్ల నిఖిల్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ 2023లో నిఖిల్ సిద్ధార్థ పాపులర్ ఛాయిస్‌లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఇక నిఖిల్ కు ఈ అవార్డ్ రావడంపై…

యంగ్ హీరో 'నిఖిల్' తండ్రి కన్నుమూత
టాలీవుడ్ లో గత కొంతకాలంగా ఏదో ఒక విషాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఈమధ్య సెలబ్రిటీల మరణవార్తలను ఎక్కువగా వినాల్సి వస్తుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులను కోల్పోయింది చిత్రపరిశ్రమ. రీసెంట్ గానే ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ కన్ను మూశారు. ఇక ఇప్పుడు మరో యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి కాస్త విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. మరోవైపు నిఖిల్ తండ్రి చనిపోవడంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు…

పాండమిక్ ఎఫెక్ట్ కెరీర్స్ పై చాలా పడింది..!
కరోనా వల్ల గత రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో చూస్తున్నాం. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా చెప్పిన డేట్ కే రిలీజ్ అవుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. ఇక ఈ కరోనా వల్ల స్టార్ హీరోలకు ప్రాబ్లమ్ లేకపోయినా.. ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న యంగ్ హీరోల కెరీర్ కు మాత్రం కష్టమనే చెప్పొచ్చు. కాస్త సినిమాలు రిలీజ్ అయి హిట్లు పడితేనే కెరీర్ కొనసాగుతుంది. ఇప్పుడు ఇదే విషయంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్.

నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నా..!
యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య నిఖిల్ సినిమాలు ఒకటి కూడా రిలీజ్ కాకపోయినా వరుసగా సినిమాలు అయితే చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని నిఖిల్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ఇంతకుముందు ఒక సినిమా తరువాత ఒక సినిమా చేశాననీ, ఈ సారి మాత్రం ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నానని చెప్పాడు.. అంతేకాదు నాలుగు పిల్లల్లో ఎవరు ఎక్కువ ఇష్టమంటే ఏం చెబుతాం .. ఇది కూడా అంతే అంటూ చమత్కరించాడు. ఈ సినిమాలన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశాడు.

షూట్ మోడ్ లో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ ", చందు మొండేటి దర్శకత్వంలో "కార్తికేయ 2 " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నిఖిల్ తన వంతు సాయంగా హాస్పిటల్ బెడ్స్ , మెడిసిన్స్ , ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. గ్రామాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడానికి నిఖిల్ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పటికే అనేక సినిమా రిలీజ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు సినిమాల షూటింగ్ లను కూడా వాయిదా వేసుకుంటున్నారు పలువురు హీరోలు. ఇప్పటికే ప్రభాస్, మహేష్ లాంటి వాళ్లు సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లారు. ఇక తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా తన సినిమాల షూటింగ్ లను వాయిదా వేసుకున్నాడు.

నిఖిల్ 20.. అధికారిక ప్రకటన వచ్చేసింది
మొత్తానికి యంగ్ హీరో నిఖిల్ వరుసపెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2', పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్‌లో '18 పేజెస్' చిత్రాలు చేస్తున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు.
దర్శకుడు ఆర్ జి వి కి నిఖిల్ కౌంటర్
ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రేక్షకుల విమర్శలు అందుకుంటున్నారు. వర్మ ప్రస్తుతం "పవర్ స్టార్ " మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇది పవర్ స్టార్ బయోపిక్ కాదు అని అనౌన్స్ చేసిన వర్మ పవన్ కళ్యాణ్ , చిరంజీవి పోలిన మనుషులతో "పవర్ స్టార్ " మూవీ ని రూపొందిస్తున్నారు. ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ పరిస్థితి గురించి ఈ మూవీ రూపొందించినట్టుగా ఉంది.
సిక్స్ ప్యాక్ మళ్ళీ సిద్ధం - నిఖిల్
సక్సెస్ ఫుల్ "హ్యాపీ డేస్ " మూవీ తో లీడ్ రోల్ లో టాలీవుడ్ కు పరిచయం అయిన నిఖిల్ "యువత ", "స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో సూపర్ హిట్ "కార్తికేయ " మూవీ సీక్వెల్ "కార్తికేయ 2", పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. కరోనా కారణంగా ఆ మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి.
హీరో నిఖిల్ భావోద్వేగం
భారత్ , చైనా బోర్డర్ లద్ధాఖ్ లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అసువులు బాసారు. వారిలో సూర్యాపేట కు చెందిన కర్నల్ సంతోష్ కుమార్ వీర మరణం పొందారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ , వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇండియా , చైనా బోర్డర్ లో జరిగిన సంఘటనకు రక్తం మరిగిపోతుందని, చైనా వస్తువులు బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
లాక్ డౌన్ పై నిఖిల్ ట్వీట్
"అర్జున్ సురవరం "మూవీ సక్సెస్ తో హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్నారు. ప్రేమించిన యువతి ని పెళ్ళి చేసుకుని వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ లాక్ డౌన్ పై చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
నిఖిల్ కు జోడీ గా సిద్ధి ఇద్నాని
"అర్జున్ సురవరం "మూవీ విజయం తో యువ హీరో నిఖిల్ సినిమాల జోరు పెంచారు. చందు మొండేటి దర్శకత్వంలో "కార్తికేయ 2", సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్ "మూవీస్ లో నిఖిల్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ "కుమారి 21 F "మూవీ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ "మూవీ రూపొందనుంది.
కార్తికేయ 2 సీక్వెల్ కాదు..!
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన 'కార్తికేయ' సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిసాయి. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. ఫస్ట్ షెడ్యూల్ తిరుపతిలో ప్రారంభించనున్నారు.