
ట్యాగ్ · 95 కథనాలు · పేజీ 5


'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్

'రౌడీబాయ్స్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సూపర్ మచ్చి'

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ఇవే..!

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక అందులో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ది డిఫరెంట్ స్టైల్. అందమైన ప్రేమకథలను తెరపై అంతే అందంగా చూపించడంతో ఇంద్రగంటిది డిఫరెంట్ స్టైల్. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి ఎన్నో ప్రేమకథలను చూపించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

ఓటీటీలోకి సుమంత్ 'మళ్ళీ మొదలైంది'
మళ్లీ ఓటీటీల రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ సమయంలో పరిస్థితులు అసలు బాలేకపోవడంతో, థియేటర్లు కూడా తెరిచే పరిస్థితి లేకపోవడంతో చాలా చిన్న సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఒక రకంగా ఓటీటీ వేదికలకు మంచి డిమాండ్ పెరిగింది కూడా గత రెండేళ్ల నుండే అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వేవ్ తరువాత కాస్త పరిస్థితులు అనుకూలించడంతో అప్పటివరకూ పెండింగ్ లో ఉన్న సినిమాలను.. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని ఆపిన సినిమాలను వరుసగా రిలీజ్ చేసేశారు. ఇక ఇప్పుడు మళ్లీ థర్డ్ వేవ్ ప్రభావం మొదలైంది. మళ్లీ కొన్ని చోట్ల కర్ఫ్యూలు, థియేటర్లు మూసివేయడంతో.. పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ లు ఆగిపోతున్నాయి. మీడియం…

'సామాన్యుడు' ట్రైలర్ రిలీజ్
తమిళ హీరోల సినిమాలు ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందన్న సంగతి కూడా విదితమే. ఇక రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా ఈసినిమా వస్తుంది. పదవి, అధికారం కోసం సామాన్యులను అంతం చేయడానికి చూస్తున్న రాజకీయ నాయకులను ఒక సామాన్యుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశంపై ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు శరవణన్.

'రౌడీ బాయ్స్' రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ
ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ ను మాత్రం ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని చూడాలంటే ఈసినిమాను చూడొచ్చు.

రివ్యూ.. 'బంగార్రాజు' కి కలిసొచ్చిన పండుగ
ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. దానికితోడు పోటీలో పెద్ద సినిమాలేవి లేకపోవడం ‘బంగార్రాజు’కు కలిసొచ్చింది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమా అని చెప్పొచ్చు.

'రౌడీబాయ్స్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా చాలా భారీగానే చేశారు మేకర్స్. మరి ఈసినిమా ఎలాంటి విజయం అందిస్తుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే. ఇక ఈసినిమా చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

'బంగార్రాజు' ట్రైలర్ రిలీజ్
నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. బంగార్రాజు పాత్రలో తన చలాకీ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నాడు నాగార్జున. అందుకే ఈ పాత్ర పేరుతోనే ఇప్పుడు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. అయితే ఈసినిమాలో నాగార్జునతో పాటు తనయుడు నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ. తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'స్కైలాబ్'
సత్యదేవ్-నిత్యమీనన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్కైలాబ్. 1979 లో జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. డిసెంబర్ 4న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇక సత్యదేవ్-నిత్యామీనన్ కాబట్టి.. తమ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాబట్టి ఈసినిమాలో కూడా తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా మొదటిసారి ఈసినిమాతో నిర్మాతగా మారింది నిత్యామీనన్. ఇక మొదటి సినిమాతోనే మంచి ఫలితాన్ని దక్కించుకుంది. ఇక ఈసినిమా కూడా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా…

'రౌడీ బాయ్స్' ఫంక్షన్ కు రావడం ఫేవర్ కాదు నా బాధ్యత
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా దిల్ రాజు భారీగానే చేస్తున్నాడు. పోస్టర్లు, పాటల రిలీజ్ లకు కూడా స్పెషల్ గా ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు ప్రమోషన్స్ లో పెద్ద పెద్ద హీరోలను సైతం వాడేస్తున్నాడు.
రౌడీ బాయ్స్.. 'డేట్ నైట్' పాటను రిలీజ్ చేసిన ఐకాన్ స్టార్
యంగ్ హీరో ఆశిష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ కు ఇది ఫస్ట్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా కాబట్టి టెక్నీషియన్స్ ను కూడా పెద్ద వాళ్లనే తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాకుండా రీసెంట్…

'రౌడీ బాయ్స్' ట్రైలర్ రిలీజ్
ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న హీరోలు అందరూ సంక్రాంతికి పోటీకి దిగుతున్నారు. అందులో రౌడీ బాయ్స్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సూపర్ మచ్చి'
మెగా కాంపౌండ్ నుండి వచ్చినా కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఇప్పటి వరకు అయితే ఒక్క పెద్ద హిట్ సినిమా కూడా పడలేదు. ఇక ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి సినిమాను చేస్తుండగా ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈ సంక్రాంతికి ‘సూపర్ మచ్చి’ సినిమాతో రాబోతున్నాడు. సంక్రాంతికి పెద్ద సినిమాలు లేకపోవడంతో ఈసినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి…

'అతిథి దేవోభవ' ట్రైలర్ రిలీజ్
పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ అతిథి దేవోభవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వీలైనంత ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అన్నీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి…

సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ఇవే..!
సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ లవర్స్ కు మరో పండగలాంటిదే. పెద్ద పెద్ద సినిమాలు చాలా వరకూ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికే డేట్స్ ను రిజర్వ్ చేసుకుంటాయి. చిన్న సినిమాలు చాలా వరకూ సంక్రాంతి రిలీజ్ లను పెట్టుకోరు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం చాలా వరకూ చిన్న సినిమాలే సందడి చేయడానికి సిద్దంగా ఉన్నాయి. దానికి కారణం పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పోటీ నుండి బయటకు తప్పుకోవడమే. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

సంక్రాంతి సినిమాలు.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?
ప్రతి ఏడాది సంక్రాంతి వచ్చిందంటే అందరి సంగతేమో కానీ సినిమా లవర్స్ కు మాత్రం పెద్ద పండగే. బక్సాఫీస్ వద్ద సినిమాలు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది మాత్రం దురదృష్టం అనే చెప్పాలి. కరోనా వల్ల చాలా సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈనేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతికి కూడా పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం పోటీ గట్టిగానే ఉంది. పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పొంగల్ బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నాయి. దాదాపు అరడజనకు పైగా పెద్ద సినిమాలు ముందు రిలీజ్ కు సిద్దమవ్వగా ఆతర్వాత కొన్ని సినిమాలు రిలీజ్ నుండి తప్పుకున్నాయి. వాటిలో సర్కారు వారి పాట, ఎఫ్ 3 సినిమాలు కూడా ఉన్నాయి. ఫైనల్ గా సంక్రాంతి…