పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ అతిథి దేవోభవ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వీలైనంత ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ అన్నీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Wishing all the best to dear #AadiSaiKumar and the whole team of #AtithiDevobhava 👍🏼
▶️ https://t.co/Ogl5P0bsgK#AtithiDevobhavaOnJan7th#AadiSaiKumar #Nuveksha #PolimeraNageshwar #SekharChandra #MiryalaRajababu #MiryalaAshokReddy @Srinivasa_Cine
— Nani (@NameisNani) January 5, 2022
ఇక ఈసినిమాలో ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈసినిమాకు.. అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.