సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు ఇవే..!

Telugu Movies Releasing For Sankranti,Telugu Films Releasing For Sankranthi 2022,Latest 2022 Telugu Movie,Pongal Movies,Sankranthi 2022,Sankranthi 2022 Movies,Telugu Sankranthi 2022 Movies,News Sankranthi 2022 Movies,2022 Sankranthi Movies,2022 Sankranthi Telugu Movies,Sankranti 2022 Telugu Movies List,Sankranti 2022 Telugu Movies,2022 Sankranti Telugu Movies,Sankranti 2022 Telugu Movie Releases,Upcoming Movies Releasing On Sankranti 2022 In Telugu,Sankranthi 2022 Tollywood Movies,Telugu Upcoming Movies,Telugu Movies Sankranthi 2022 Release,Sankranti 2022 Release Movies,2022 Sankranti Movie Releases,2022 Sankrathi Telugu Movies List,Sankranti 2022 Telugu New Movies,Sankranthi 2022 Tollywood Upcoming Movies,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,Telugu Movies 2022,Sankranthi Telugu Movies,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Sankranthi Release Telugu Movies 2022,Sankranthi Release Telugu Movies,Upcoming New Telugu Movies Releases In Sankranthi,Movies In Sankranthi 2022,Upcoming Telugu Movies In Sankranthi 2022,Upcoming Telugu Movies,Radhe Shyam Movie,Upcoming Tollywood Movies,Upcoming Telugu Movies 2022,Telugu Movies,New Telugu Movies,New Telugu Movies 2022,Sankranthi 2022 Telugu Movies,1945,RRR,Radhe Shyam,Bangarraju,DJ Tillu,Hero,Rowdy Boys,Super Machi,7 Days 6 Nights,Atithi Devobhava,Shekar,1945 Movie,Valimai,Veyi Subhamulu Kalugu Neeku,#RadheShyam,#Bangarraju

సంక్రాంతి వచ్చిందంటే బాక్సాఫీస్ వద్ద సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ లవర్స్ కు మరో పండగలాంటిదే. పెద్ద పెద్ద సినిమాలు చాలా వరకూ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికే డేట్స్ ను రిజర్వ్ చేసుకుంటాయి. చిన్న సినిమాలు చాలా వరకూ సంక్రాంతి రిలీజ్ లను పెట్టుకోరు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి మాత్రం చాలా వరకూ చిన్న సినిమాలే సందడి చేయడానికి సిద్దంగా ఉన్నాయి. దానికి కారణం పెద్ద పెద్ద సినిమాలు అన్నీ పోటీ నుండి బయటకు తప్పుకోవడమే. మరి ఈ సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాధేశ్యామ్

రాాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా వస్తున్న ప్రేమకథ రాధేశ్యామ్. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల చాలా ఆలస్యమైంది. ఫైనల్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నిజానికి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే కావడం విశేషం.

బంగార్రాజు

నిజానికి ఈసినిమా సీక్వెల్ ను ఎప్పటినుండో అనుకుంటున్నా సెట్స్ పైకి వెళ్లడానికే చాలా లేట్ అయింది. చాలా సినిమాల కంటే వెనుకే షూటింగ్ ను మొదలుపెట్టింది. అయినా కూడా చాలా ఫాస్ట్ గా షూటింగ్ ను కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ కు సిద్దం చేశారు. నిజానికి ఈసినిమా షూటింగ్ రీసెంట్ గానే కంప్లీట్ అయింది. అయితే షూటింగ్ తోపాటే పోస్ట్ ప్రొడక్షన్, మరోవైపు ప్రమోషన్స్ కూాడా స్టార్ట్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు. ఇక చాలా సినిమాలు సంక్రాంతి బరి నుండి తప్పుకోవడంతో బంగార్రాజు రేసులోకి వచ్చాడు. డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ.. బంగార్రాజు మాత్రం సంక్రాంతికి సందడి చేయడానికి వస్తున్నాడు.

రౌడీ బాయ్స్

శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి.. ఇప్పటికే ఒకటి రెండు సార్లు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ఆ తరువాత మళ్లీ వాయిదా కూడా వేసుకున్నారు. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి బరిలోకి ఈసినిమాను తీసుకురానున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

శేఖర్

రాజశేఖర్ లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో శేఖర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ కూడా పొంగల్ బరిలోకి రావడానికి రెడీ అయిపోయాడు. అయితే రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ పొంగల్ బరిలోకి వస్తున్నట్టు మాత్రం ఇప్పటికే ప్రకటించారు చిత్రబృందం. రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

1945

రానా గత ఏడాది అరణ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఫలితాన్ని పక్కన పెడితే రానా నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో సినిమా రిలీజ్ తో సిద్దంగా ఉన్నాడు. శివకుమార్‌ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా వస్తుంది. ఈసినిమాను డిసెంబర్ 31న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అయితే సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.

హీరో

టిడిపి ఎంపి గల్లా జ‌యదేవ్, మహేష్ బాబు మేనల్లుడు గ‌ల్లా అశోక్ హీరో గా శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న సినిమా హీరో. అశోక్ గల్లా హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో సినిమా ఈ నెల 15న సంక్రాంతి పండక్కి థియేటర్‌లలో విడుదల కాబోతోంది.

డీజే టిల్లు

కృష్ణ అండ్ హిజ్ లీల అనే సినిమాతో ఫామ్ లోకి వచ్చిన సిద్దూ జొన్నలగడ్డ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఇక ఈసినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు.

7 డేస్ 6 నైట్స్

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు ‘డర్టీ హరి’తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టాడు. ఇక ఆసినిమా ఇచ్చిన సక్సెస్ తో ఎం.ఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’ లాంటి యూత్ ఎంటర్టైనర్ తో వచ్చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్.

సూపర్ మచ్చి

కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సూపర్ మచ్చి. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సూపర్ మచ్చి సినిమా ఈ నెల 14న సంక్రాంతి పండక్కి థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.

అతిథి దేవోభవ

పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అతిథి దేవోభవ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈసినిమాను ఈనెల 7వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఇంకా వీటితో పాటు పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్దంగా ఉన్నాయి. మరి వీటిలో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయి.. ఎన్ని సినిమాలు ఫట్ అవుతాయి చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here