ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలు బరిలో లేకపోవడంతో చిన్న హీరోలు అందరూ సంక్రాంతికి పోటీకి దిగుతున్నారు. అందులో రౌడీ బాయ్స్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ , పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ట్రైలర్ కూడా అన్ని ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: