
ట్యాగ్ · 17 కథనాలు


ఎన్టీఆర్ సింహాద్రి కోసం మాస్ కా దాస్

ఎన్టీఆర్ సింహాద్రి మూవీ రీ రిలీజ్ డేట్

'పోకిరి' ఇంక్రెడిబుల్ క్రేజ్..!

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్

ఇకపై రీమేక్ లు చేయాలనుకోవడం లేదు...!

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్

"నారప్ప "మూవీ పై వెంకటేష్ కామెంట్స్

'నారప్ప' 180 కంట్రీస్ లో చూశారు..!

నారప్ప పై చిరు ప్రశంసలు.. వెంకీ కనిపించలేదు

వెంకటేష్ పై సమంత ప్రశంసలు

'నారప్ప' రివ్యూ

'నారప్ప' ట్రైలర్ రిలీజ్

'తలైవి' ట్రైలర్ రిలీజ్

థగ్ లైఫ్- రానున్న మాసివ్ అప్ డేట్
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఒక సినిమా థగ్ లైఫ్. చాలా ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.

ఏఎన్నార్ శత జయంతి వేడుకలు.. హాజరైన రాజమౌళి, రామ్ చరణ్, బ్రహ్మానందం తదితరులు
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, అక్కినేని కుటుంబ సభ్యులు హాజరై అక్కినేనికి ఘనంగా నివాళులు అర్పించారు.

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ లుక్ రిలీజ్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకునే పనిలో పడింది.

ఎన్టీఆర్ సింహాద్రి కోసం మాస్ కా దాస్
స్టార్ హీరోల సినిమాలకు వారి పుట్టినరోజులకు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలను రీరిలీజ్ చేశారు. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాతో పాటు పలువురు హీరోల సినిమాలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా అది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజుకు సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

ఎన్టీఆర్ సింహాద్రి మూవీ రీ రిలీజ్ డేట్
విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా సింహాద్రి మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక, అంకిత కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సింహాద్రి మూవీ ని తెరకెక్కించారు. సింహాద్రి మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

'పోకిరి' ఇంక్రెడిబుల్ క్రేజ్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి. 2006లో వచ్చిన ఈసినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. పూరీ మార్క్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, పాటలు ఒకటేమిటీ ఈసినిమాలో అన్ని ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా ఉండటంవల్లే ఈసినిమా అప్పట్లో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అయితే ఈసినిమా రిలీజ్ అయి 16 ఏళ్లు అయిపోతుంది. అయినా కూడా ఈసినిమా క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదని మరోసారి రుజువైంది.

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఖిలాడి సినిమా మాత్రం సరైన విజయం అందించలేకపోయింది. దీంతో రవితేజ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఖాతాలో నాలుగు సినిమాలు ఉండగా అందులో ఈ ఏడాదే రెండు సినిమాలైనా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందులో ముందుగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇకపై రీమేక్ లు చేయాలనుకోవడం లేదు...!
గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను చాలా మంది రీమేక్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఎన్నో రోజులుగా నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టక్ జగదీష్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. మొదట ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ చాలా రోజులు సస్పెన్స్ లో ఉంచి ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా రేపు స్ట్రీమింగ్ కానుంది.

'క్లాప్' మూవీ టీజర్ రిలీజ్
ఆది పినిశెట్టి గురించి.. తన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుకే తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు.

"నారప్ప "మూవీ పై వెంకటేష్ కామెంట్స్
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందిన యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ జులై 20 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందిన “నారప్ప “మూవీ లో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “నారప్ప “మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. "నారప్ప "మూవీ వెంకటేష్ సినీ కెరీర్ లో ఒక మైలురాయి గా నిలిచింది.

'నారప్ప' 180 కంట్రీస్ లో చూశారు..!
డైరెక్ట్రర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం నారప్ప. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈసినిమా తెరకెక్కింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడంతో కాంప్రమైజ్ అయి సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేశారు. జూలై 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమాలో వెంకీ నటనకు గాను ప్రశంసలు దక్కాయి. ఆయన చూపించిన వేరియేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నారప్పలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇక ఈసినిమా మంచి విజయం దక్కించుకోవడంతో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది.

నారప్ప పై చిరు ప్రశంసలు.. వెంకీ కనిపించలేదు
తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో వెంకీ ప్రధాన పాత్రలో నారప్పగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. శ్రీకాంత్ అడ్డాల ఈసినిమాకు దర్శకత్వం వహించాడు. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న రిలీజ్ అయింది. ఇక వెంకీ తన కెరీర్ లో ఎప్పుడు చేయని పాత్రలో చేయడంతో వెంకీ నటనను చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరు కూడా వెంకీ పై ప్రశంసలు కురిపించాడు.

వెంకటేష్ పై సమంత ప్రశంసలు
సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ జులై 20 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందిన "నారప్ప "మూవీ లో ఎమోషనల్ గా సాగే రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ ఎంతో అద్భుతంగా నటించారు. మెయిన్ గా ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో వెంకటేష్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో వెంకటేష్ నారప్ప పాత్రలో నటించారు అనే కంటే జీవించారు అని చెప్పడం సమంజసంగా ఉంటుంది.

'నారప్ప' రివ్యూ
ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈసినిమాకు ప్లస్ అయింది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పనక్కర్లేదు రిచ్ గానే ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే అసురన్ చూడని వాళ్లకు నారప్ప ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

అభిమానులకు వెంకీ సారీ
వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ గా నారప్ప ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న రిలీజ్ కాబోతుంది. దీనిలో భాగంగానే రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు అభిమానులు కాస్త కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న సినిమా.. అయినా కూడా ఓటీటీలో రిలీజ్ చేస్తుండటంతో అసంతృప్తితో ఉన్నారు. ఇక ఈనేపథ్యంలో తాజాగా ఒక…

'నారప్ప' ట్రైలర్ రిలీజ్
తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఓటీటీలో ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా నారప్ప ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ‘నారప్ప’గా వెంకటేష్ నటన ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ…

'తలైవి' ట్రైలర్ రిలీజ్
దివంగతనటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న జయలలిత కన్నడ నాట జన్మించి తమిళనాడులో స్థిరపడింది. ఇప్పుడు కంగనా హీరోయిన్ గా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో సినిమా రూపొందించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.