విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా సింహాద్రి మూవీ 2003 జులై 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భూమిక, అంకిత కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. ఎన్టీఆర్ డ్యాన్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సింహాద్రి మూవీ ని తెరకెక్కించారు. సింహాద్రి మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను ఫ్యాన్స్ కోసం వారి బర్త్ డేలు, పలు ప్రత్యేకమైన రోజుల్లో రీ-రిలీజ్ చేస్తున్నారు. 4k వెర్షన్ లో మరింత బెస్ట్ అవుట్ పుట్ ను అందిస్తూ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ కాగా వాటికి అద్భుతమైన స్పందన లభించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బాస్టర్ సింహాద్రి మూవీ రీరిలీజ్ కు సిద్ధం అవుతుంది. సింహాద్రి సినిమాకు 4కే వెర్షన్ లో అప్డేట్ చేసి ప్రింట్ సిద్ధం చేసి.. తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే20 వ తేదీ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: