‘నారప్ప’ రివ్యూ

Narappa Telugu Movie Review,Telugu Filmnagar,Narappa Movie Review,Narappa Review,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Update,Narappa Telugu Movie Updates,Narappa Telugu Movie Latest News,Narappa Movie Latest News,Narappa Film Updates,Narappa Telugu Movie Live Updates,Narappa Movie Live Updates,Narappa Movie Story,Narappa Movie Breaking News,Narappa 2021,Narappa Movie Public Talk,Narappa Public Talk,Narappa Movie Public Talk,Narappa Movie Public Response,Venkatesh Narappa Telugu Movie Review,Narappa Telugu Movie Review And Rating,Narappa Movie Rating,Narappa Movie Release Updates,Narappa Review And Rating,Latest News On Narappa,Latest Telugu Movie Reviews 2021,Narappa Movie Review And Rating,Narappa Telugu Movie Public Talk,Narappa Telugu Movie 2021,Narappa Movie Online,Venkatesh Narappa,Priyamani Narappa Movie,Srikanth Addala Narappa,Amazon Prime Video,Narappa Movie Latest Updates,Narappa Trailer,Narappa 2021,Venkatesh,Priyamani,Rao Ramesh,Nassar,Prime Video,Narappa On Prime,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh Movies,Narappa Telugu,Srikanth Addala,Venkatesh And Priyamani Movie,Narappa Venkatesh,Venkatesh Narappa Movie Review,Narappa Telugu,Narappa Movie Details,Narappa Movie Updates,#NarappaOnPrime,#Narappa

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. నేడు అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా రిలీజ్ అయింది. మరి ఈసినిమాలో వెంకీ ఎలా నటించాడు.. తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంది లాంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీ నటులు:వెంకటేశ్,ప్రియమణి,కార్తీక్ రత్నం,ప్రకాశ్ రాజ్,రావు రమేష్,రాజీవ్ కనకాల
దర్శకుడు: శ్రీకాంత్ అడ్డాల
బ్యానర్స్: సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్
నిర్మాతలు: సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను
సంగీతం: మణిశర్మ

కథ.. ఈసినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసురన్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఈసినిమా తెలుస్తుంది. రామసాగరం అనే ఊరిలో పాండుసామి (నరేన్) తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఊర్లో అందరి భూమిని లాక్కోవాలని చూస్తుంటాడు. నారప్ప (వెంకటేష్)కు చెందిన మూడు ఎకరాలు తప్ప ఊర్లోని పొలమంతా కూడా పాండుసామి చేతుల్లోకి వెళ్తుంది. ఇక నారప్ప పెద్ద కొడుకు ముని ఖన్నా (కార్తీక్ రత్నం) ఆవేశ పరుడు. అతను మాత్రం పాండుసామికి ఎదురు తిరుగుతాడు. తనకు జరిగిన అవమానంతో ముని ఖన్నాను పాండుసామి చంపేస్తాడు. అయినా కూడా నారప్పలో చలనం రాదు. తన కొడుకును చంపేశారని నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) బాధపడుతూనే ఉంటుంది. తల్లి బాధను చూడలేక నారప్ప రెండో కొడుకు సిన్నబ్బ (రాఖీ) పాండుసామిని చంపేస్తాడు. ఇక తన రెండో కొడుకును అయినా కాపాడుకోవాలని నారప్ప పలు ప్రయత్నాలు చేస్తుంటాడు. నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అన్నదే కథ.

విశ్లేషణ

ఇది తమిళ సినిమా రీమేక్.. అందులోనూ సూపర్ హిట్ అయిన సినిమా కాబట్టి కథ కథనం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే అసలు సమస్య ఏంటంటే.. ఇక్కడి ప్రేక్షకులను మెప్పించడమే పెద్ద టాస్క్. ఎందుకంటే డైరెక్ట్ సినిమా అయినా పర్లేదు కానీ రీమేక్ కథలు తెరకెక్కించడం అంత సులభమైన పనేమీ కాదు. అది కత్తి మీద సాము వంటిది. అయితే కాస్త మార్పులు చేసి మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు సినిమాను తెెరకెక్కించారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. పేదవాళ్లు-పెద్దవాళ్లు, కులవివక్ష వీటిపై ఎన్నో సినిమాలు వచ్చాయి.. ఈసినిమాలో కూడా అదే చూపించారు. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మాత్రం నారప్ప విషయంలో సక్సెస్ అయినట్టే. ప్రతీ ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశారు. సామాజిక స్పృహ కలిగించేలా శ్రీకాంత్ అడ్డాల రాసిన మాటలు కూడా అందరినీ ఆలోచింపజేసేలా ఉంటాయి.

ఇక వెంకటేష్ నటన గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకూ తను ఇలాంటి పాత్రలో చేయలేదు. అయినా కూడా నారప్పగా అద్భుతంగా నటించాడు. పాత్ర కొత్తదే అయినా కూడా ఎమోషన్ ను పండించడంలో వెంకీ దిట్ట. ఈసినిమాలో కూడా పలు ఎమోషన్ సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టిస్తాడు. పౌరుషం లేని తాగుబోతు తండ్రిగా.. ఏమీ చేతగాని వాడివంటూ కొడుకు మాట్లాడే సందర్భంలోనూ వెంకటేష్ చాలా బాగా నటిస్తాడు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి అద్భుతంగా నటించింది. ముని ఖన్నాగా కార్తీక్ రత్నం, సిన్నబ్బగా రాఖీ, బసవయ్యగా రాజీవ్ కనకాల, లాయర్ వరదరాజులుగా రావు రమేష్, శంకరయ్యగా నాజర్ ఇలా ప్రతీ ఒక్కరూ కూడా తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు.

ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈసినిమాకు ప్లస్ అయింది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పనక్కర్లేదు రిచ్ గానే ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే అసురన్ చూడని వాళ్లకు నారప్ప ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 13 =