ట్యాగ్ · 15 కథనాలు
దేశం గర్వించే నిర్మాత మీరు..!
చిరంజీవి తీపి జ్ఞాపకం
టాలీవుడ్ తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
చిత్ర ప్రముఖులతో చిరంజీవి మీటింగ్

'సల్మాన్ ఖాన్' వార్తలపై చిరు క్లారిటీ..!
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ?
నేషనల్ మీడియా ద్వారా చిరంజీవి సందేశం
'డియర్ విజయ్' నీ ఆవేదన అర్థమైంది..!
చిరంజీవి మే డే శుభాకాంక్షలు
హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే -చిరంజీవి
సోషల్ మీడియాలోకి రావడానికి అదే కారణం..!
చిరంజీవి లాక్ డౌన్ యాక్టివిటీ

మెగా అభిమానులకు 'చిరు' ఉగాది కానుక
ప్లాస్మా డొనేషన్ కై చిరంజీవి పిలుపు
కరోనా మహమ్మారి వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ప్రాణాలు రక్షించవచ్చనే విషయం తెలిసిందే. కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా దానానికై సైబరాబాద్ కమిషనరేట్ లో సి పి సజ్జనార్ ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్లాస్మా దానం చేసిన కొంతమంది దాతలను సజ్జనార్ సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా మెగా స్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
దేశం గర్వించే నిర్మాత మీరు..!
ఈ రోజు మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85 వ జయంతి. ఈ సందర్భంగా హైదరాబాదు ఫిలిం ఛాంబర్ ఆయన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ బాబు, సి.కల్యాణ్, కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
చిరంజీవి తీపి జ్ఞాపకం
లెజెండరీ యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేట్ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఆయనతో తనకు ఉన్న తీపి జ్ఞాపకాన్ని మెగా స్టార్ చిరంజీవి ప్రేక్షకులతో పంచుకున్నారు. దర్శకుడు కె . రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన "తిరుగు లేని మనిషి " మూవీ లో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు. చిరంజీవి సినీ కెరీర్ ప్రారంభం లో ఈ మూవీ రూపొందింది.
టాలీవుడ్ తరపున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు
సినిమా షూటింగ్స్ అనుమతుల గురించి చర్చించేందుకు గాను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ లో సినీపెద్దలు కేసీఆర్ తో పలు విషయాలపై మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా సీఎం జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభించుకోవచ్చిని చెప్పినట్టు సమాచారం. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని..షూటింగ్ లోకేషన్స్‌లో లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, లోకేషన్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయాలని కేసీఆర్ సూచించినట్టు తెలుస్తుంది.
చిత్ర ప్రముఖులతో చిరంజీవి మీటింగ్
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులకు లోనైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచి పోయి, రిలీజ్ లు ఆగిపోయి చిత్ర పరిశ్రమ తీవ్రం గా నష్టపోయింది. ప్రధాన మంత్రి, ముఖ్య మంత్రులు కరోనా తో జీవించాల్సిందే అన్న నేపథ్యం లో షూటింగ్స్ ప్రారంభానికై నిర్మాతలు, దర్శకులు, హీరోలతో తన ఆఫీస్ లో రేపు (21 తేదీ) చిరంజీవి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు.

'సల్మాన్ ఖాన్' వార్తలపై చిరు క్లారిటీ..!
చిరు లూసిఫర్ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే అప్పుడే ఈ సినిమాలో కాస్టింగ్ పై పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముందు అల్లు అర్జున్ నటిస్తున్నాడని.. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం కూడా లేదని అన్నారు. ఇప్పుడు తాజాగా ఈ వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. లూసిఫర్ రీమేక్ కు సంబంధించి కథలో మార్పులు జరుగుతున్నాయని.. బాలీవుడ్ హీరో సల్మాన్ నటిస్తున్నాడని వస్తున్న వార్తలు రూమర్స్ అని కొట్టి పడేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులుపూర్తయిన తరువాతే నటీనటులు ఎంపిక జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందో లేదో చూద్దాం..
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి ?
సూపర్ హిట్ "జెంటిల్ మేన్ " తమిళ మూవీ తో దర్శకుడిగా కోలీవుడ్ కు శంకర్ పరిచయం అయ్యారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన కాదలన్ (ప్రేమికుడు ), ఇండియన్ (భారతీయుడు ), జీన్స్, ముదల్ వన్ (ఒకే ఒక్కడు ), శివాజీ , ఏందిరన్ (రోబో),ఐ , 2. 0 మూవీస్ ఘనవిజయం సాధించాయి. దర్శకుడు శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 (భారతీయుడు 2) మూవీ ని రూపొందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సారథ్య సమర్ధతలకు నిదర్శనం సి సి సి
ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎవరి నోట విన్నా ఇదే మాట... నిజానికి కరోనా తీవ్రరూపం దాల్చి సమస్త ప్రపంచము స్తంభించి పోతుందని ఎవరూ ఊహించలేదు... సెంటినరీకి చేరువవుతున్న ఇండియన్ సినిమా టాకీ చరిత్రలో భారతీయ సినిమా ఇంత మూకీగా మారిపోవటం ఒక అనూహ్య పరిణామం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిరుద్యోగ నిస్సహాయతలోకి జారిపోయిన చిత్ర పరిశ్రమకు నిజమైన చేయూత కావాలి. కానీ ఆ చేయూత ఎలా లభిస్తుంది? ఎవరి ద్వారా లభిస్తుంది? గడప దాటకూడదు.. మనిషిని మనిషి తాకకూడదు... కరచాలనాలు... ఆలింగనాలు... పలకరింపులు పులకరింపులు నిషిద్ధమైన నికృష్ట పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక మీద సహాయ కార్యక్రమాలు జరగాలి అంటే అదెలా సాధ్యం...? ఇచ్చేవారు…
నేషనల్ మీడియా ద్వారా చిరంజీవి సందేశం
సోషల్ మీడియా లో ప్రవేశించిన నాటి నుండీ మెగా స్టార్ చిరంజీవి కరోనా మహమ్మారి పై ప్రజలలో అవగాహన కలిగేలా ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. 4వ తేదీ లాక్ డౌన్ ఫేజ్ 3 ప్రారంభమైన సందర్భంగా చిరంజీవి నేషనల్ మీడియా రిపబ్లిక్ వరల్డ్ .కామ్ ద్వారా కరోనా మహమ్మారి పై ప్రజలకు సందేశం ఇచ్చారు.
'డియర్ విజయ్' నీ ఆవేదన అర్థమైంది..!
విజయ్ దేవరకొండ తనపై వస్తున్న తప్పుడు వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించేలా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించి అందులో ‘మిడిల్ క్లాస్ ఫండ్’తో సహాయక కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక దీనిపై విజయ్ ను విమర్శిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై విజయ్ స్పందించి...తనపై విమర్శలు చేసిన వారిపై గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
చిరంజీవి మే డే శుభాకాంక్షలు
ప్రతీ సంవత్సరం మే 1వ తేదీ కార్మిక దినోత్సవం గా కార్మికులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా కార్మికులు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను ఆదుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు.
హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే -చిరంజీవి
ఏప్రిల్ 29 వ తేదీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డ్యాన్స్ కు కొత్త ఒరవడి క్రియేట్ చేసిన ఘనత చిరంజీవి దే. తన డ్యాన్స్ లతో ప్రేక్షక , అభిమానులను అలరించే చిరంజీవి సూపర్ హిట్ "పసివాడి ప్రాణం " మూవీ తో బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు. తనదైన స్టైల్ డ్యాన్స్ లతో చిరంజీవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
సోషల్ మీడియాలోకి రావడానికి అదే కారణం..!
మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరు ఎంట్రీ అయితే లేట్ అయిందేమో కానీ.. ఆయన మాత్రం కరెక్ట్ టైంలోనే ఎంట్రీ ఇచ్చారు. అసలే లాక్ డౌన్. షూటింగ్ లు లేవు. ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి టైం సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి పలు విషయాలను తన వీడియోల ద్వారా పంచుకుంటున్నారు. కరోనా పై అవగాహనా కల్పించే వీడియోస్ దగ్గర నుండి.. తన వ్యక్తిగత జీవితం వరకూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తూనే ఉన్నారు. ఒకరకంగా యంగ్ హీరోస్ కూడా అంత యాక్టీవ్ గా లేరు. చిరు మాత్రం ప్రతి విషయాన్ని అప్ డేట్ ఇస్తూ.. కొన్నిసార్లు సప్సెన్స్ క్రియేట్ చేస్తూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు.
చిరంజీవి లాక్ డౌన్ యాక్టివిటీ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కై ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయాన్ని పలువురు సెలబ్రిటీస్ తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి గార్డెనింగ్ వంటి పనులతో బిజీగా ఉన్నారు. చిరంజీవి సోషల్ మీడియా లో జాయిన్ అయిన నాటి నుండి కరోనా అవగాహన పై పలు మెసేజ్ లు , వీడియో లు పోస్ట్ చేస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. సినీ కార్మికుల సహాయార్ధం కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను ప్రారంభించి వారికి సేవలందిస్తున్నారు.

మెగా అభిమానులకు 'చిరు' ఉగాది కానుక
టైటిల్ చూసి చిరు ఉగాదికి ఏం కానుక ఇవ్వనున్నారబ్బా అనుకుంటున్నారుకదా..? తన 152 సినిమా గురించి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని.. సినిమా టైటిల్ ఏమన్నా ప్రకటిస్తారేమో.. ఇలా పలు ఆలోచనలు రావొచ్చు. కానీ అసలు సంగతేంటంటే.. చిరు ఇవ్వనున్న సర్ ప్రైజ్ ఏంటంటే... తాను కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇక తన భావాలను, సందేశాలను తన అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఆయన తెలియజేశారు.