ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 84
ఈ నలుగురు నా కెప్టెన్లు
నితిన్ చెక్ రిలీజ్ డేట్ ఫిక్స్
పవన్ కళ్యాణ్ కొత్త అవతారం
హీరో విజయ్ కు మహేష్ కోనేరు అభినందనలు
'జైసేన' రైతులకి అంకితం
'శాకుంతలం' మ్యూజిక్ వర్క్ స్టార్ట్
కాజల్ న్యూ తమిళ మూవీ
జిమ్ లో తమన్నా వర్కౌట్
మంచిరోజులొస్తాయి - రాశీఖన్నా
షూటింగ్స్ తో రకుల్ ప్రీత్ బిజీ
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ట్రైలర్ రిలీజ్
'రాధే శ్యామ్' లో నా పాత్ర అదే
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
అఖిల్ న్యూ మూవీ ఫిబ్రవరి లో ప్రారంభం
స్టార్ హీరో సూర్య కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
'లక్ష్య' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
తొలి భారతీయ నటిగా సమంత కే ఆ ఘనత
ఒక హీరోయిన్ కు ఎలాంటి క్వాలిటీస్ఉండాలి.. వ్యక్తిగత జీవితాన్ని.. సినీ జీవితాన్ని ఎలా బ్యాలన్స్ చేయాలి.. ఎలాంటి టైంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఇవన్నీ మనం అక్కినేని కోడలు సమంత లో చూడొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే అందరికంటే సామ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సామ్ చాలా తక్కువ టైంలో టాలీవుడ్ లో లక్కీ అండ్ టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. సాధారణంగా పెళ్ళైన తర్వాత హీరోయిన్స్ సినీ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టే అంటారు. ఆ సంప్రదాయాన్ని కూడా సమంత చెరిపేసింది. పెళ్లైన తర్వాత రంగస్థలం, యూ టర్న్, ఓ బేబీ, సూపర్ డీలక్స్ ఇలా వరుసహిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది…
ఈ నలుగురు నా కెప్టెన్లు
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ.. ప్రకటిస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చివరి దశకు చేరుకుంది. ఇక షూటింగ్ దశలో ఉండగానే లూసిఫర్ రీమేక్ ను కూడా రీసెంట్ గా ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు.
నితిన్ చెక్ రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. లాక్డౌన్కు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇక చంద్రశేఖర్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ కొత్త అవతారం
రాజకీయ పార్టీ జనసేన ను స్థాపించి సినిమాలకు దూరం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "వకీల్ సాబ్ " మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కొంతకాలం గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
హీరో విజయ్ కు మహేష్ కోనేరు అభినందనలు
సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ , మాళవిక మోహనన్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "మాస్టర్ "తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిర్మాత మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు డబ్బింగ్ వెర్షన్" మాస్టర్ "ను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు.
'జైసేన' రైతులకి అంకితం
వి.సముద్ర దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వస్తున్న చిత్రం జైసేన. ఈ సినిమాకూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.జనవరి 29న గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా
'శాకుంతలం' మ్యూజిక్ వర్క్ స్టార్ట్
మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా గుణ శేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శాకుంతలం పాత్రలో అక్కినేని కోడలు సమంత నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ఇక తాజాగా దుష్యంతుడి పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చాడు. సమంత మినహా మిగతా పాత్రల్లో నటించబోయే నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇతరుల పేర్లను ప్రచారం చేయవద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రూమర్స్ ను బ్రేక్ చేశారు.
కాజల్ న్యూ తమిళ మూవీ
తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ “ఆచార్య ” మూవీ తో పాటు”మోసగాళ్ళు “, తమిళ మూవీస్ “ఇండియన్ 2 “, హే సనామికా “, “ముంబై సాగ (హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. అక్టోబర్ 30 వ తేదీ కాజల్ వివాహం తన మిత్రుడు గౌతమ్ తో జరిగిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హానీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న "ఆచార్య “మూవీ షూటింగ్ లో పాల్గొని కాజల్ తన షూటింగ్ పార్ట్ మొదటి షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు.
జిమ్ లో తమన్నా వర్కౌట్
స్టార్ హీరోయిన్ తమన్నా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తమన్నా “గుర్తుందా శీతాకాలం “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్” మూవీ తెలుగు రీమేక్ లో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. బ్లాక్ బస్టర్ “F 2 “మూవీ సీక్వెల్ “F 3 “మూవీలో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు.
నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
ప్రస్తుతం నాగశౌర్య వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో వున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం నాలుగైదు సినిమాలు నాగశౌర్య లిస్ట్ లో వున్నాయి. వాటిలో ఇప్పటికే రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఈ రోజు నాగశౌర్య పుట్టిన రోజు కావడంతో వరుస సర్ప్రైజ్ లు ఇస్తున్నారు అభిమానులకు. తాజాగా తన కొత్త సినిమాకు సంబందించిన మరో అప్ డేట్ వచ్చింది.
మంచిరోజులొస్తాయి - రాశీఖన్నా
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటో షూట్స్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.
షూటింగ్స్ తో రకుల్ ప్రీత్ బిజీ
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రకుల్ కథానాయికగా రూపొందిన మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వ,లో నితిన్ హీరోగా రూపొందుతున్న "చెక్ "మూవీ లో రకుల్ నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ "అయలాన్ ", బ్లాక్ బస్టర్ "ఇండియన్ "మూవీ సీక్వెల్ "ఇండియన్2 " తమిళ మూవీస్ లో రకుల్ కథానాయిక గా నటిస్తున్నారు.
'దుబాయ్' లో సర్కారు వారి పాట
గత ఏడాది సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ వెంటనే 'సర్కారు వారి పాట' సినిమాను లైన్ లో పెట్టాడు. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ మాత్రం ఇన్నిరోజులు పెండింగ్ లో పడిపోయింది. ఇక ఇప్పటికే చాలా మంది హీరోలు షూటింగ్లు మొదలు పెట్టి పూర్తి చేసి కొన్ని సినిమాలు రిలీజ్ కూడా అయ్యాయి.
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ట్రైలర్ రిలీజ్
మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కూడాఆగిపోయింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక మొదటినుండి ప్రదీప్ సినిమా కాబట్టి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇటీవలే ప్రకటించారు. జనవరి 29న ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయనుంది.
'రాధే శ్యామ్' లో నా పాత్ర అదే
జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా 'రాధే శ్యామ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పూజా హెగ్డే తన షూట్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకూ టైటిల్ పోస్టర్ ను, పూజా హెగ్డే, ప్రభాస్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయగా వాటికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?
మాస్ మహారాజా రవితేజ , దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. "క్రాక్ " మూవీ ఘనవిజయం సాధించడంతో దర్శకుడు గోపీచంద్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. పలువురు హీరోలు గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యం లో బాలకృష్ణ మూవీ ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి.
అఖిల్ న్యూ మూవీ ఫిబ్రవరి లో ప్రారంభం
అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని , పూజా హెగ్డే జంటగా రూపొందిన లవ్ స్టోరీ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈషా రెబ్బా , ఆమని , మురళీశర్మ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తరువాత హీరో అఖిల్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
నాగశౌర్య కొత్త సినిమా టైటిల్ 'పోలీసు వారి హెచ్చరిక'
నాగశౌర్య వరుస సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. లక్ష్య, వరుడు కావలెను సినిమాలు ఇప్పటికే షూటింగ్ దశలో ఉండగా ఇప్పుడు మరో కొత్త సినిమాతో రావడానికి సిద్దమయ్యాడు.
స్టార్ హీరో సూర్య కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
యాక్ట్రెస్ కావాలని కోరుకున్న మోడల్ ప్రియాంక అరుళ్ మోహన్ "ఒంధ్ కథె హెల్ల "కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. నాని హీరోగా రూపొందిన "గ్యాంగ్ లీడర్ "మూవీ తో ప్రియాంక కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శివకార్తికేయన్ హీరోగా రూపొందుతున్న "డాక్టర్ "తమిళ మూవీ తో ప్రియాంక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ప్రియాంక ప్రస్తుతం కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా అగ్రికల్చరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న "శ్రీకారం " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
'లక్ష్య' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. అంతేకాదు ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలన్న పట్టుదలతో ఇప్పుడు విభిన్నమైన కథలతో వస్తున్నాడు. అలా చేస్తున్న సినిమాల్లో ఒకటి 'లక్ష్య'. సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య ఈ సినిమా. ఈ సినిమా కోసం నాగశౌర్య తన లుక్ ను సైతం మార్చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ లుక్ ను రిలీజ్ చేయగా...దానికి మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.