గత ఏడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీ గా వున్నాడు. అందులో నితిన్-చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వస్తున్న చెక్ సినిమా ఒకటి. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అంతేకాదు ఈసినిమా నుండి న్యూ ఇయర్ సందర్భంగా చిన్నపాటి వీడియోను ఒకటి రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జైలు నేపథ్యంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇక చంద్రశేఖర్ అనగానే ప్రేక్షకులు ఆశించే అంశాలన్నీ ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసేసారు. ఫిబ్రవరి 19న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. కాగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కల్యాణిమాలిక్ ఈ సినిమాకు సంగీతం అందించగా..సినిమాటోగ్రఫీ రాహుల్ శ్రీవాత్సవ్ అందించాడు.
The wait is over! #Check♟️ is coming to you on February 19th. 😎
#CheckOnFeb19th@yeletics @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @BhavyaCreations @adityamusic pic.twitter.com/uIq4IsGoiZ— nithiin (@actor_nithiin) January 22, 2021
ఇక వెంకీ అట్లూరి తో చేస్తున్న `రంగ్ దే` షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంతోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మరో వైపు అందదూన్ రీమేక్ షూటింగ్ లో ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































