మున్నా దర్శకత్వంలో ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ కూడాఆగిపోయింది. మళ్లీ థియేటర్స్ ఓపెన్ కావడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక మొదటినుండి ప్రదీప్ సినిమా కాబట్టి ఈ సినిమాకు హైప్ బాగానే వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఇటీవలే ప్రకటించారు. జనవరి 29న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి చేయనుంది.
ఇక ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్టు అర్ధమవుతుంది. బాగా ఆడే వాడికి పిచ్‌తో పనిలేదు.. బాగా రాసే వాడికి క్వచ్చన్ పేపర్‌తో పని లేదని హీరో ప్రదీప్ మాచిరాజు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.
Wishing all things good, happy and successful to the entire team of #30RojulloPreminchadamEla
Big hugs to @impradeepmachi @Actor_Amritha @DirectorMunna1 @anuprubens and the entire team!
Here is the trailer 🙂https://t.co/soSpOTS6nm
— Vijay Deverakonda (@TheDeverakonda) January 21, 2021
కాగా అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా హర్ష చెముడు, భద్రం, హేమ, పోసాని కృష్ణమురళి, ‘శుభలేఖ’ సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఎస్.వి.బాబు ఈ చిత్రాన్ని ఎస్.వి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.