మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శాకుంతలం పాత్రలో అక్కినేని కోడలు సమంత నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సెట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలుకానుంది. ఇక తాజాగా దుష్యంతుడి పాత్రపై కూడా క్లారిటీ ఇచ్చాడు. సమంత మినహా మిగతా పాత్రల్లో నటించబోయే నటీనటుల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇతరుల పేర్లను ప్రచారం చేయవద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రూమర్స్ ను బ్రేక్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ సినిమా సాంగ్స్ కంపొజిషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.
Songs Composing starts 🎹
The much-lauded combination of Gunasekhar – Manisharma ..and their beautiful melodies 🎶#Shaakuntalam @gunasekhar1 @Samanthaprabhu2 #Manisharma @neelima_guna @GunaaTeamworks#EpicLoveStory #MythologyForMillennials pic.twitter.com/LB2ULj0mo3— Gunaa Teamworks (@GunaaTeamworks) January 22, 2021
ఇక సినిమాలో సెట్స్ గురించి గుణశేఖర్ ఎంత క్రియేటివిటీ తో ఎంత అద్భుతంగా ప్లాన్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. మరి అసలే ఇప్పుడు చేసేది పౌరాణిక ప్రేమ. ఇది మహాభారతంలోని ఆదిపర్వంలోగల ఒక కథాంశం. ఇంకెంత ప్లాన్ చేస్తాడు. ఈ సినిమా కోసం కూడా భారీ సెట్ ప్లాన్ చేస్తున్నాడట గుణశేఖర్. దాదాపు ఎక్కువ శాతం అక్కడే షూటింగ్ జరిగేలా చూడనున్నట్లుగా తెలుస్తోంది. పౌరాణిక సినిమా కావడంతో అందుకు తగ్గుట్టుగా సెట్ ఉండేలాగా గుణశేఖర్ దగ్గరుండి మరీ పనులను పరిశీలిస్తున్నాడట.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: