సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ , మాళవిక మోహనన్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “మాస్టర్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. నిర్మాత మహేష్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు డబ్బింగ్ వెర్షన్” మాస్టర్ “ను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ అయిన”క్రాక్ “, “RED “, “అల్లుడు అదుర్స్ “మూవీస్ తో పోటీపడి మాస్టర్ విజయం సాధించడం విశేషం. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ కోనేరు చెన్నై లో స్టార్ హీరో విజయ్ ను కలసి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తన మూవీ ని ఆదరించినందుకు హీరో విజయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసారని మహేష్ చెప్పారు. తనకు “మాస్టర్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ సహకరించిన తమిళ నిర్మాతలకు మహేష్ థ్యాంక్స్ చెప్పారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: