కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 76

సినిమా వార్తలు

తండ్రీ కొడుకులుగా రవితేజ ?

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా సూపర్ హిట్ "రాక్షసుడు "మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ " ఖిలాడి "మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తమన్నా ఫేవరేట్ స్టార్స్

"చాంద్ సా రోషన్ చెహ్రా" (2005 ) బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన తమన్నా సక్సెస్ ఫుల్ "శ్రీ "(2005 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు . తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", "F 3 " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " తెలుగు రీమేక్ లో ఒక కీలక పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

క్లైమాక్స్ చిత్రీకరణలో "ఆచార్య "

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా "ఆచార్య " మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సోనూసూద్ , అజయ్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"విరాటపర్వం "ఉమెన్స్ డే స్పెషల్ వీడియో రిలీజ్

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ" మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలోరానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన "విరాటపర్వం "మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన "విరాటపర్వం "మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'గాలి సంపత్' కు నేష‌న‌ల్ అవార్డ్ రావాలి -రామ్

బ్లాక్ బ‌స్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం గాలి సంప‌త్. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా గాలి సంప‌త్…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"వకీల్ సాబ్ " ఉమెన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఏ హీరో సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

సినిమా లవర్స్ మాత్రం ఆ ఏడాది పండగే పండగ. గ్యాప్ లేకుండా ప్రతివారం కనీసం ఓ నాలుగైదు సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. అవి కూడా ఏదో చిన్నా చితకా సినిమాలు.. లైట్ తీసుకునే సినిమాలు కూడా లేవు. అన్నీ మంచి భారీ అంచనాలతో వస్తున్న సినిమాలే. కొన్ని సినిమాలు మాత్రం గత ఏదాది రిలీజ్ కాకుండా పెండింగ్ లో ఉన్నవి.. ఇంకొన్ని సినిమాలు ఆ ఏడాది రిలీజ్ కు సిద్దంగా ఉన్నవి.. వెరసి గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ కాగా మరికొన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. అంతేకాదు పెద్ద సినిమాలు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చిరు 'ఆచార్య', పవన్ 'వకీల్ సాబ్', ప్రభాస్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అతనే నా అందాల రాకుమారుడు -సమంత

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో "శాకుంతలం " మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందనున్న "శాకుంతలం " మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తున్న "శాకుంతలం " మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్టింగ్స్ తో రూపొందనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ లో 'అక్షర'

బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'అక్షర'. విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యావ్యవస్థలోని లోపాలును చూపిస్తూ ఈసినిమాను రూపొందించినఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఆకాశవాణి' టీజర్ రిలీజ్

రాజమౌళి దగ్గర అనేక సినిమాలకు పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఆకాశవాణి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ ఇంతవరకూ ఈ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే ఇప్పుడు తాజాాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

యూవీ కాన్సెప్ట్స్ కొత్త సినిమా.. ప్రీ-లుక్ రిలీజ్

యూవీ క్రియేషన్స్ .. ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన మిర్చి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్స్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.ఇక ఆతర్వాత శ‌ర్వానంద్ తో ర‌న్ రాజా ర‌న్‌, నానితో భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, అనుష్క‌తో భాగ‌మ‌తి, ప్ర‌భాస్ తో సాహో ఇలా బ్లాక్‌బాస్ట‌ర్ చిత్రాల‌ను అందించింది. ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మిస్తోంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'జాతిరత్నాలు' ట్రైలర్ రిలీజ్

అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక తాాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హిట్ 2 లో హీరోయిన్ గా 'మీనాక్షి చౌదరి'..!

సుశాంత్ హీరోగా నటిస్తోన్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ లోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే .. రవితేజ ‘ఖిలాడి’ లో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఇప్పుడు మరో సినిమా లో కూడా మీనాక్షి చౌదరి అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు హిట్ సీక్వెల్ హిట్2.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'HIT' సీక్వెల్ కన్ఫామ్ చేసిన నాని

శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఓ కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ స్టొరీగా హిట్ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను.. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

రాజ్ తరుణ్ 'పవర్ ప్లే' ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురు చూసే హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. రీసెంట్‌గా విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈ సినిమాకు కూడా మిశ్రమ ఫలితమే దక్కింది. . రాధామోహన్‌ నిర్మించగా, మాళవికానాయర్‌ కథానాయికగా నటించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్రగంటి-సుధీర్ బాబు సినిమా టైటిల్ అప్ డేట్

ఇంద్రగంటి మోహనకృష్ణ- సుధీర్ బాబు కాంబినేష‌న్ లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చిన సంగతి తెలసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాను లాంచ్ చేశారు కూడా.

TFN Adminవాట్సాప్
రివ్యూ

'చెక్' రివ్యూ - మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్

ఫస్టాఫ్‌ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్‌ చేయకుండా నార‍్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరుక్కున్నాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగిస్తాడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. సెకండాఫ్‌లో కోర్టు, చెస్ ఆట, జైలులో గొడవలు ఇలా ట్విస్ట్ లతో సాగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే మైండ్ గేమ్‌తో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్

షేర్