అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక తాాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ప్రభాస్ ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉండగా.. ఈ ట్రైలర్ విడుదల కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ ను కలవడానికి వెళ్ళింది చిత్రబృందం. ఈ సందర్భంగా వారితో ప్రభాస్ సరదాగా కాసేపు ముచ్చటించి. ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ తోనే ఇంత నవ్వుకున్నానంటే సినిమా చూస్తే ఎలా ఉంటుందో ఊహించగలను’ అంటూ ప్రశంసించాడు. ఇక ట్రైలర్ ఆద్యంతం కామెడిగా సాగింది. ముగ్గురు స్నేహితులు అనుకోకుండా ఒక దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, ఆ తరువాత ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అన్నదే కథ. ఇక సినిమాకు హీరోయిన్ మరో మేజర్ ప్లస్ పాయింట్ అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Superb trailer… 👌🏻 👌🏻👌🏻Loved it… My best wishes to Team #JathiRatnalu for their release on March 11th. https://t.co/evp5rrJCt2 – #Prabhas via facebook#JathiRatnaluTrailer @NaveenPolishety @fariaabdullah2@priyadarshi_i @eyrahul #AnudeepKV @nagashwin7@SwapnaCinema pic.twitter.com/s0jeb0ZcPt
— Prabhas (@PrabhasRaju) March 4, 2021
ఇక స్వప్న సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాతగా మారనున్నారు. ఈ చిత్రానికి సంగీతం రాధన్ అందిస్తున్నారు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రలో నటిస్తుండగా మురళీ శర్మ, నరేష్ వి.కె, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























